ఎంతకాలమైంది ......

ఎంతకాలమైంది ......

భావ శూన్యమైన వేళ 
ఆలోచనలు తొలచిన వేళ
పలుకుల పొందిక లేక
సందడి చేసే ఉత్సాహం లేక
కాలం ద్రోలించటం పైనే దృష్టి నిలిపిన వేళ 
ఎక్కడి నుండి వస్తుందీ కవితావేశం.
భరోసా లేని బ్రతుకులు
చస్తూ బ్రతుకుతూ కాలం వెళ్లదీస్తున్న  దేశం.
భోగ భాగ్యాలతో తులతూగే నా దేశం నేడు 
పరాయి దేశాల ఆపన్న హస్తం వైపు చూపులు.

అహంకారం తలకెక్కితే ఏమవుతుందో చూపిన కరోనా
స్థితిమంతులమే అయిన
భయాందోళనల నడుమ పయనం మా మనుగడ కోసం.
రెక్కాడితేగాని డొక్కాడలేని శ్రమజీవుల పాలిట ఏ దేవుడు కరుణించేను.
గూడు లేని బ్రతుకును, రోడ్డునే నమ్ముకున్న దీనులను ఉద్ధరించే వారేరి ?
కరోనా అంటు వ్యాధి బారిన పడిన ఈ వేళ
విధించిన నిర్భంధ వేళ  
మధ్య తరగతికి రోజు గడిచేది ఎలాగో ?
మహమ్మారి  ఉపశమనానికి నిధుల వర జల్లులు కురిసిన 
భూమి పుత్రులకు చేరిందా...?
స్వీయా నాయకోదరపోషణార్థం కాక ప్రతి పేదవారికి చేరితే అదే మాధవ సేవా.
మధ్య తరగతి కష్ట నష్టాలను 
జీవన వేదనలను గమనించినా చాలు అదే పదివేలు.
ఆసుపత్రిలో బేడ్ లేక
ఆక్సిజన్ లభించక,
ప్రతి గ్రామం, పట్టణం, నగరం అనే భేదం లేకుండా మరణ మృదంగం ధ్వనిస్తూంటే...
ప్రాణాలు పోయిన వేళ 
కళ్ళలో కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప,
ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ...
కాకి లెక్కలు చూపి కరోనా ప్రభావాని కూడా తగ్గిస్తూ....
ఆడిన ఆటలు చాలించు.
ఆయుర్వేద విజ్ఞానంతో సామాన్యులకు వైద్యం అందిస్తుంటే,
నాటు వైద్యం అంటూ , కాదు అంటునో 
ప్రచార మాధ్యామాలు పేలాలు ఏరుతున్న వైనం.

 
రాజకీయాల పితలాటకంలో విద్యా వ్యవస్థ- పరీక్షలు 
ఎటూ పాలుపోని పరిస్థితిలో నిలిచిన వేళ....
ఆన్లైన్ క్లాస్ లో ఏమి  వింటున్నారో  చదువుతున్నారో తెలియని వైనం... 
వ్యాక్సిన్ కోరతతో
వ్యాక్సిన్ అనుమానాలతో
వ్యాక్సిన్ వ్యాపారంతో
ఫంగస్ గోలలతో
తల మునకలవుతున్నా.... చేతులు వదిలేసినా ...
వైద్య సౌకర్యాలు పెంచక,
ఎన్నికలుంటే చాలు ....అనుకోనే నాయకా,
విజయం చేజిక్కక వెలవెల బోయిన వేళ
2024 నీదికా...
అంతవరకు కాపాడుకో నీ జనతా.
ఈ క్లిష్ట సమయంలో చూపించూ  మానవత్వం.
సాటి మనిషిగా ఆదరించు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టు.
కరోనా అరికట్టడమే లక్ష్యం నివారణ చర్యలే శరణ్యం.
వ్యాక్సిన్ కు బెదరక ధైర్యంగా తీసుకొనేదుకు సిద్ధం.
స్వచ్చ్ భారత్ కరోనా ముక్త్ భారత్ ...
డాక్టర్. పోల బాల గణేశ్, తెలుగు అధ్యాపకులు, డి.యన్.ఆర్. కళాశాల, భీమవరం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ