గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం
గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం
డాక్టర్. పోల బాల గణేష్,
ఈ.ఎం.ఆర్. మోడల్ స్కూల్,
బుట్టాయిగూడెం,
ఏలూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్-5344465
9704555450.
భూమిపై మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు సాటి మనుషుల
పట్ల మానవత్వం కలిగి ఉండాలి. తనలాగా తోటి మనిషి కూడా అనేక సమస్యలతో
బాధపడుతున్నాడని అతని పట్లకనీసంగా మానవత్వం కలిగి
వ్యవహరించాలనే దృక్పథం గురజాడ కవిత్వంలో కనిపిస్తుంది. భారతీయ సమాజం వర్ణాలుగా విభజింపబడి, ఆయా వర్ణాలు తమదైన వృత్తిని జీవన విధానాలు కలిగి
సమాజంలో జీవిస్తుంటారు. కానీ మన భారతీయులు
వర్ణాశ్రమ ధర్మాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి కనీసం మానవులుగా కూడా వ్యవహరించకుండా,
ఈ సమాజంలో అట్టడుగు వర్గాన్ని సృష్టించి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించే అనేక
నియమాలను ఏర్పరచుకొని జీవించడం జరిగింది.
“మలిన వృత్తులు మాలవారని
కులము వేర్చిన బలియు రొక దే
శమున కొందరి వెలికి దోసిరి
మలినమే, మాల
కులము లేదట వొక్క వేటున
పసరముల హింసించు వారికి
కులము కలదట నరుల వ్రేచెడి
క్రూర కర్ములకున్.
మలిన దేహుల మాల లనుచును,
మలిన చిత్తుల కధిక కులముల
నెల వొసంగిన వర్ణ ధర్మ మ
ధర్మ ధర్మంబే.
మంచి చెడ్డలు మనుజు లందున,
యెంచి చూడగ, రెండె కులములు,
మంచి యన్నద, మాలయైతే,
మాలనే అగుదున్.”- లవణరాజు కల
“యెల్ల లోకము లొక్కయిలై
వర్ణ భేదము లెల్ల కల్లై
వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ” అంటూ
ఈ సమాజంలో వర్ణభేదములు సమసిపోయి అందరూ కలిసి జీవించాలని ప్రబోధించాడు. ఈ సమాజంలో ఉన్న వివిధ మతమూలన్నీ ప్రక్కన పెట్టి జ్ఞానము ఒకటే నిలిచి ప్రకాశవంతం కావాలని కోరుకున్నాడు. సమాజంలోని ఉన్న మూఢవిశ్వాసాలు నమ్మకాలు సాంప్రదాయాలు ఆయన వ్యతిరేకించాడు. తన స్వీయ సమాజంలో వేళ్ళునూకొన్ని ఉన్న బాల్యవివాహాలను, కన్యాశుల్కమును ఆయన వ్యతిరేకించాడు. ఈ భారతదేశంలో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని వారి ప్రయోజనార్థం వినియోగించుకొని ఆంగ్ల విద్యను అభ్యసించిన వర్గం వారిదైన జీవన పరిస్థితులలో మార్పులను ఆహ్వానించడం జరిగింది. అందులో మొదటిది తన *కులంలోని మూఢవిశ్వాసాలు నమ్మకాలు ఆచార వ్యవహారాలను వైజ్ఞానిక దృక్పథంతో వివేచన చేసి అవి మంచివి కావని గ్రహించి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేశారు. వారిలో మొదటి వారు కందుకూరి వీరేశలింగం తర్వాత గురజాడ వారు. తమ సమాజంలోని పరిస్థితులను ధనం కోసం, ఆస్తికోసం వారు తలపెట్టే అతి అసమాన వయస్సు పెళ్లిలను, తరువాత భర్తను కోల్పోయిన స్త్రీల యదార్థ జీవన స్థితిగతులను పరిశీలించి బాల్య వివాహాలను కన్యాశుల్కమును వ్యతిరేకంగా గురజాడ వారు కన్యాశుల్కం నాటకం రచన చేశారు.
ఇవి అన్ని మొదట వారి వర్ణంలోని లోపాలను గుర్తించి సంస్కరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వీరు అభ్యుదయకవులుగా పేరు పొందారు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అంటూ దేశ ప్రజలే ఈ దేశానికి ప్రధానమని తెల్పారు. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టి చూపవోయ్ అని సమాజాభివృద్ధి కోసం మాటలతో కాకుండా చేతలతో ఈ సమాజానికి ఉపయోగపడే పనులను చేయాలని గురజాడ పేర్కొన్నారు. భారతదేశం అంతటికి వెలుగు గీతం, జాతీయ సమైక్యత గేయంగా అన్ని భాషలలో తర్జుమా అయ్యి పాడుకొని ఆచరణలో పెట్టవలసిన గేయం "దేశభక్తి" గేయ రచన చేశారు.
“సొంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టి కాదోయి
దేశమంటే మనుషులోయి.
చెట్టా పట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడవ వలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్ని మెలగవలెను”
భారతదేశంలో ఉన్న అన్ని జాతుల ప్రజల సహనం సహకారం
పరస్పర స్నేహంతో మెలుగుతూ ఉండాలి అని మతాలన్నీ అన్నదమ్ములు వల్లె కలిసి
జీవించినట్లు ఉండాలని ఆయన తెలిపారు. సంఘసంస్కరణ భావాలను ఆయన
తన రచనలు ద్వారా పాదులు తీశారు. ప్రజల మధ్య భేద భావాలు సంపూర్ణంగా తొలగిపోవడానికి
కృషి చేశారు.
“మతం వేరైతేను యేమోయి
మనసు లొకటై మనుషులంటే
జాతమన్నది లేచి పెరిగి
లోకమున
రాణించునోయి”
అంటూ మతం ఏదైనా ప్రజల మనసు ఒకటై ఉంటే భారతజాతిగా ప్రపంచంలో గొప్ప దేశంగా గుర్తింపు పొందుతుందని,
పరమత సహనాన్ని గురజాడ తెలియజేశాడు. దేశం నాకు ఏమి ఇచ్చింది అని కాకుండా తనకు ఉన్న దేశాభిమానం గురించి గొప్పలు
చెప్పకుండా దేశం కోసం ఏదైనా ఒక మంచి పని చేసి చూపించమని భారతీయులకు నేర్పిన
దేశభక్తులు గురజాడ.
“దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని యేదైనను
నొకమేల్
కూర్చి జనులకు చూపవోయ్”
గురజాడ వైజ్ఞానిక దృక్పథం కలిగిన
వ్యక్తి. అతను హేతువాదిగా ఉండి మనుషులను కనీసం మనుషులుగా కూడా చూడకుండగా దైవం అంటూ
తిరుగుతున్నాడని మనుషులు ఏర్పాటు చేసుకున్న దైవానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి
మనుషులను తక్కువ చేసి చూడటం ప్రశ్నించారు.
“మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయి రప్పల
కన్నా కనిష్టం
గాను చూస్తా వేల
బేలా
దేవుడెకడో దాగెనంటూ
కొండ కోనలు వెతుకులాడే
వేలా
కన్ను తెరిచిన కానబడడో
మనిషి మాత్రుడి యందు లేడో
యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి”
అంటూ సమాజంలో మానవత్వం కలిగి ఉండి సాటి మనుషులకు సహాయం చేయడం గురించి
చెప్పారు. గురజాడ మానవునికి ఈర్ష్యా, ఆసూయలు ఉండకూడదని సాటి
మనుషుల పట్ల ఆదరణ భావం కలిగి ఉండాలని గురజాడ కవిత్వం తెలుపుతుంది.
“ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసెనోయి
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చువోయి
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయి
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయి
పూను స్పర్థను
విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్థ కలహం పెంచబోకోయి
కత్తి వైరం
కాల్చావోయి”
అంటూ మానవుడు ఇతరుల సంపదను చూసి దుఃఖించకూడదన్ని,
ఇతరులకు కలిగిన మేలు తనకు జరిగిన మేలుగా భావించి ఉన్నట్లయితే వారికి కూడా మేలు
కలుగుతుందని, నైతికతను ప్రేరేపించారు. కేవలం విద్యలు అందే స్పర్థ ఉండాలన్ని,
వాణిజ్యంలో పోటీ ఉండాలన్ని సమాజంలో వ్యర్థంగా కలహాలను రేపకూడదని, సమాజంలో గొడవలను కొట్లాట్లను కలిగించకూడదని గురజాడ
వారి దేశభక్తి కవిత తెలియజేస్తుంది. మానవుడిగా ఎలా జీవించాలో, మానవత్వం కలిగి ఉండి
సమాజంలో ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారిగా మానవత్వ విలువలతో నైతికత కలిగిన దేశ
పౌరులుగా ఉండాలన్ని, వైజ్ఞానిక దృక్పథాలోచన
ధోరణి పెంపొందించుకొని దేశ పౌరులుగా దేశాభివృద్ధికి కట్టుబడి ఉండాలని గురజాడ
కవిత్వం నేటికీ మన సమాజానికి మార్గ నిర్దేశం చేస్తుంది.
1. సామాజిక దురాగాతాలను బహిర్గతం చేస్తూ ఉన్నత నైతిక భావాలను వ్యాప్తి చేయడం కంటే
మిన్న అయినా లక్ష్యము సాహిత్యానికి వేరొకటి లేదు- మహోదయం కె.వి.ఆర్ పుట- 221
2. యోగ్యత విషయమై ప్రశ్నించినవాడు అపండితుడు పితూరిదారు హుణ విద్యా మాత్ర పరిచయుడు సంప్రదాయ ద్వేషి పండిత విరోధి బ్రాహ్మణ కులం పైని హైందవ మతం పైని కత్తిగట్టిన ఆకతాయి.
3. "సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతం దేశభక్తి గేయం" అని శ్రీశ్రీ గారు తెలియజేశారు.
తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సంపుటము- డాక్టర్ జి నాగయ్య పుట్ట- 621
4. మానవతా దృష్టితో రంగరించి రచించిన గురజాడ దేశభక్తి గేయము అంతర్జాతీయ ప్రసిద్ధికెక్కినది.
5. విశ్వమానవ ప్రేమను ప్రబోధించుచు గురజాడ తన గళమును సారించినాడు. అజ్ఞాన అందకారమునకు
ప్రతీకగా మారిన మత చాదస్తమును ఖండించారు.
6. కలసి మెసిగినంత మాత్రమునే కలుగబోది యైకమత్యము మాల మాదిగ కన్నెనెవరినో మరులు కొనరాదా
అని చెప్పిన వర్ణాంతర వివాహములను ప్రోత్సహించవలనను ఉద్దేశ్యమును రేకెత్తించును.
7. మలిన వృత్తుల వారిని మాలవారని పిలిచి సమాజమునకు దూరము చేసిననుట పసరాలను హింసించు
వారికి లేని కులము నరులను వేచు క్రూరవర్ణులకెక్కడ నుండి వచ్చినదని ప్రశ్నించుట వంటివి
ఈ విషయమునే సమర్థించుచున్నవి మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడ రెండే కులములు మంచి
అన్నది మాల అయితే మాలనేనగుదున్ అని చెప్పిన మాటలు గురజాడ వారి యాభిప్రాయములను ప్రకటించుచున్నవి
కులమును బట్టిగాక గుణమును బట్టి గౌరవింపవలనని ఈ ఘట్టము నిరూపించుచున్నది. గురజాడ వారు
అస్పృశ్యత నివారణము లవణ రాజు కల నిరూపించును.
ఉపయుక్త
గ్రంథ సూచిక
1.
గురజాడ రచనలు- కవితల సంపుటం- సంపాదకుడు- సెట్టి ఈశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్
హౌస్-విజ్ఞాన్ భవన్-హైదరాబాద్.-2007.
మానవత్వం,సంఘ సంస్కరణాభిలాష, స్వేచ్చా,సమానత్వం వంటి ఎన్నో అంశాలపై తన పదునైన కలాన్ని ప్రయోగించి ప్రజలపై వారి అభిప్రాయాల జల్లు కురిపించిన.... మన అడుగు జాడ గురజాడ గారికి కృతజ్ఞతలు
రిప్లయితొలగించండి