అధ్యాపకత్వం
అధ్యాపకత్వం దరఖాస్తులు నింపిన నిరాశతో వెనుదిరిగిన రోజులున్నా, మౌఖిక పరీక్షలో విఫలమైన, అనుభవం లేశమాత్రమైన లేకపోయిన విషయాసక్తి ధైర్యమిస్తుంది. ఏ రోజుకైన పాఠం చెప్పకపోనా అనే ఆశావాద దృక్పథం నిత్యం ప్రోత్సహిస్తోంది. ఈ తపనంతా చదివిన చదువుకు సార్థకత్వం సాధించుకోడానికే. తొలిసారిగా అధ్యాపక వృత్తిలో చేరిన రోజు మొదటి గంట కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న క్షణాలు ఇవి. వికశిస్తున్నా విద్యార్థుల మనసులు గెలుచుకోవడానికి వెళ్తున్నా క్షణాలివి. తరగతిగదిలోకి అడుగు పెడుతున్నా... పాఠం చేప్పడం ఒక్క కళ. ఈ కళను సాధన చేయడానికి ప్రయాణం మొదలైన వేళ. సామరస్యంతో, ఔదార్యంతో, నేర్పు, ఓర్పు, జ్ఞాన, విజ్ఞానల కూర్పులతో ముందుకు వెళ్తాను. ఉపాధి చూపి అభివృద్ధిలోకి వస్త...