పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

తరాలకు తరగని గని నేను

చిత్రం
  తరాలకు తరగని గని నేను వివక్ష రంగుకే అనుకున్న కాని విద్యకు కూడా ఉందని తెలిపింది భారతం నా కవన నైపుణ్యం ఎంత మెచ్చిన లోనారసి చేసిందే నా జనాభాను చూసి సిట్లు ఓట్లు నోట్లు ఉద్యోగాలు పదవులు పొందడానికి నా బోమ్మ పెడతారు కాసేపు నన్ను స్మరిస్తారు నా రచనలను చర్చిస్తారు మేధావులు ఆధునిక ధృతరాష్ట్రులు గాంధారి వీర విధేయులు మరేమో మహామహోపాధ్యాయ పూల్లేల 1 వారు ఆర్యులు లేరు వర్ణం లేదు అందరూ భారతీయులే అంటారు స్వార్థచింతనతో నాడు అప్రకటిత నేడు ప్రకటిత ప్రయోజనాలను ఆశించి, పాటింప చేస్తూ సౌక్యం పోందుతున్నారు నేటి ఆచార్యులు మాత్రం నా మూలం మరవకుండా దత్తాత్రేయ మంత్రం జపిస్తారు మరి ఏ ఫలసిద్ధి కోసమో.... విశ్వమానవులు మీరు నేడు కాశీలో గెలిచారని వక్కాణించారో మహాత్ముడు జంకు లేకుండా ముందుకు అడుగు వేసిన కవిని నేను నానాపాట్లుకు పడ్డాను గోదావరి వడ్డు దాతృత్వం నెల్లూరి ఆర్థిక ప్రోత్సాహం నేను మరవను ధర్మాలు ఎన్ని ఉన్న మానవ ధర్మం పాటించ్చు పొట్టకొట్టి జీవితాని మోడు చేసే ఆలోచనలతో రాక్షసానందం పొందమాకు నా కోసం కాదు నీ కోసం మీ పిల్లల కోసం ఏడ్వండి సంపదను పోగేయండి వనరు

“తిలక్ వ్యక్తిత్వము- ఆత్మీయత” వ్యాస కర్త :- డా. టి. రాజేశ్వరి గారు, లైబ్రేరియన్ (రిటైర్డ్), తెలుగు శాఖ, కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి.

చిత్రం
  డా. టి. రాజేశ్వరి మేడమ్ గారు కాశీ హిందూ విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం లో   ఆచార్య శ్రీ గుంటూరు త్రివిక్రమయ్య గారి పర్యవేక్షణలో భావ అభ్యుదయ కవి బాల గంగాధర తిలక్ అనే సిద్ధాంత గ్రంథం సమర్పించి డాక్టరేట్ పట్టా పోందారు. వారు ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ గ్రంథాలయం అధికారిగా విధులు నిర్వహించారు. నేను 2011-2013 ఏమ్.ఏ తెలుగు చదువుతున్నపుడు వారిని తెలుసుకున్న. వారి నిర్వహణలో గ్రంథాలయం నడిచింది. తెలుగు నేల పై నుండి అక్కడికి చదుకోవడానికి వెళ్లిన మాపై వారు (పి.బాలగణేశ్, జే. శ్రీకాంత్, ఆర్ . రాజేశ్, ఇ. కీర్తి, ఎన్.సునీత) ఏంతో ఆప్యాయత చూపారు. వినాయక చవితి, ఉగాది పండగలకు మమల్ని పిలిచి ఆదరించేవారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు. వారు   భారతి వంటి పత్రికలు ఉన్న, ఏన్నో ఉత్తమైన అతి విలువైన పుస్తకభాండారం, విజ్ఞాన ఖనిని విజయవంతంగా నడిపారు జ్ఞాన సమపార్జనలో మములను ప్రోత్సహించారు.  నేను పరిశోధనలో అడుగు పెట్టినప్పుడు నాకు వచన కవిత్వం రాసిన తిలక్ గారి గురించి చేప్పారు. అయితే నా అంశం "వచన కవిత్వము-అభివ్యక్తీకరణ 1990 నుండి 2001 వరకు" గల కాలం ప్రధానం కావడంతో వారి పరిశోధక గ్రంథం పుర్తిగా  చదివే అవకాశం కలు
చిత్రం
  కళా తపస్సులకు వీడ్కోలు సరిగమలు సాధన చేస్తే అదే నా జీవనాధారం అయింది శ్రద్ధాభక్తితో గానం చేస్తే అఖిల భారతావని అక్కున చేర్చుకుంది ప్రతీ గాయకునికి తనంతటి వానిగా ఎదగాలనే తపనతో నన్ను ఒ    శిఖరాన్ని చేసింది సంగీతం   నేపథ్య గేయమే   నా ప్రాణమై ప్రణవమైంది స్నేహ వాత్సల్య ప్రేమాభిమాన భక్తి మాధుర్యమే నన్ను శ్రోతల హృదయాల్లో పదిల పరిచింది ఓర్పు నిటూర్పుల ఉత్సాహ గాన గమనమే జీవికను స్థిరపరిచింది ఇహ సాక్షాత్ సకల కళా మూల స్వరూపిణినైన సరస్వతీ దేవి స్వర్చానకు దివికి ఏగుతున్న దివ్య కమలచరణ ఉపాసనతో దివికి ఏగుతున్న స్వర గాన నైపుణ్యంతో దివికి ఏగుతున్న రాగ తాల లయాత్మక పాటల సంపదతో సంగీత  శాస్త్ర  పటిమతో   గంధర్వుల జయ జయ నాదాలతో దివికి ఏగుతున్నాను మీ గాన గంధర్వుని దివికి ఏగుతున్న కళా తపస్సులకు వీడ్కోలు.          -పోల బాలగణేశ్, పరిశోధక విద్యార్థి, తెలుగు శాఖ,    కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి-221005. 26 -09-2020.   కవిత రాయమని ప్రోత్సహించిన రుత్తల శ్రీధర్ గారికి కృతజ్ఞతలు.

శ్వేత పద్మం వికసించిన వేళ

చిత్రం
  శ్వేత పద్మం  వికసించిన  వేళ   పచ్చని పచ్చిక బయలు మిల మిల మేరిసే శిలలు సుగంధ పరిమళాల ఎర్రటి పూవనాలు ఆకాశం తాకే నిటారు దేవదారు వృక్షాలు     ఆనందడోలికల్లో ఒలలాడించే కాశ్మీర సోయగాలు పండు వెన్నెలు వెదజల్లుతున్న మహోన్నత శిఖరాలు ఆది శంకరుల పాదాలు ముద్దాడిన పరమపవిత్రదామాలు నవయౌవన కాంతిరేఖల మధుర గానాల రాచ హంసల కీలకీలలు తెట తేనెల అమృత కళశభాండారాల పట్టుకోమ్మ కాశ్మీర్ కాశ్మీర్ కల్లోలిత కాకిగూడుల నిత్య పోరాటాల వనం కోకిలమ్మలను దరిచేరనివని విద్రోహుల వ్యూహాలు స్వర్ణకచిత నగాల వెవేల హృదయాల ఆనంద వేళ భారతీయత ఆలింగనంలో చేరిన చారిత్రాత్మక క్షణం అపూర్వం అనిర్వచనియం అఖండం అజరామరం సంపూర్ణ కాశ్మీర శంకర విజయం శ్వేత పద్మం వికసించిన సుమనోహర సుందర దృశ్యం నేటి సమాప్తం రేపటి ఆహ్వనం మాపటి సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం భారతదేశం. పోల బాల గణేష్   తెలుగు విభాగం, పరిశోధక విద్యార్ధి, కాశీ హిందూ విశ్వవిద్యాలయం. వారణాసి.

ప్రకృతికి చేసిన సన్మానం

చిత్రం
  ప్రకృతికి చేసిన సన్మానం అరణ్యాల వెంట వూర్లు వెలసినప్పుడు తెలియలేదు వారు ఈ పని చేస్తారని,  మానవుల నివాసం కోసం భూమి కావలని అడవులను చేరారు, నిప్పటించారు, భూమిని సాగు చేశారు. అడవిలోని గిరిజనులను తరిమినప్పుడు తెలియలేదు, వారు జంతు జాతులను దూరంగా తరుముతారని, ధనం కోసం, ఆటవిడుపు కోసం వేటాడుతారని వారు సాటి మనుషుల పట్ల, మా పై చూపే మానవత్వం ఏమిటో, ఏంతటిదో తెలిసిందప్పుడే. అభయారణ్యాలు పేర చట్టాలు తెచ్చి, అడవి బిడ్డలను నియంత్రించి, అటవి రక్షణ పేరుతో కేసులు పెట్టి, చేతి వృత్తికి దూరం చేసి పోట్టకొట్టి, గూడు పడగోటారు అడివి నివాసానికి దూరం చేశారు. జంతుకోటి పై వారు చూపే ప్రేమాభిమానాలు జంతుశాలలో చూస్తూనే వున్నాయి జంతువులు ప్రాథమికరంగం ఆధిపత్య మనసు ఒకటైతే కార్యనిర్వహక మనసు మరోకటవుతుందా సాటి మనుషుల పై దాడి చేసే స్వాభావం నిలుస్తూందా... అమానవత్వం నా పై చూపుతుందా  ఈ క్రౌర్యం  వలసవాద తత్త్వం జాతి, మతాల పేరిట చంపుకోనే ఈ మానవ అరణ్యం నన్ను గేలి చేసి నా బిడ్డను పొట్టన పెట్టుకోవడం వింతేముంది అవును యింతకిది  జీవనోపాధి విధానం కదూ.. వారి ఈ మానవ జన్మకు ఉత్కృష్ట చేష్టా