శ్వేత పద్మం వికసించిన వేళ

 

శ్వేత పద్మం వికసించిన వేళ 

పచ్చని పచ్చిక బయలు

మిల మిల మేరిసే శిలలు

సుగంధ పరిమళాల ఎర్రటి పూవనాలు

ఆకాశం తాకే నిటారు దేవదారు వృక్షాలు   

ఆనందడోలికల్లో ఒలలాడించే కాశ్మీర సోయగాలు

పండు వెన్నెలు వెదజల్లుతున్న మహోన్నత శిఖరాలు

ఆది శంకరుల పాదాలు ముద్దాడిన పరమపవిత్రదామాలు

నవయౌవన కాంతిరేఖల మధుర గానాల రాచ హంసల కీలకీలలు

తెట తేనెల అమృత కళశభాండారాల పట్టుకోమ్మ కాశ్మీర్

కాశ్మీర్ కల్లోలిత కాకిగూడుల నిత్య పోరాటాల వనం

కోకిలమ్మలను దరిచేరనివని విద్రోహుల వ్యూహాలు

స్వర్ణకచిత నగాల వెవేల హృదయాల ఆనంద వేళ

భారతీయత ఆలింగనంలో చేరిన చారిత్రాత్మక క్షణం

అపూర్వం అనిర్వచనియం

అఖండం అజరామరం

సంపూర్ణ కాశ్మీర శంకర విజయం

శ్వేత పద్మం వికసించిన సుమనోహర సుందర దృశ్యం

నేటి సమాప్తం

రేపటి ఆహ్వనం

మాపటి సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం భారతదేశం.

పోల బాల గణేష్ 

తెలుగు విభాగం,పరిశోధక విద్యార్ధి,

కాశీ హిందూ విశ్వవిద్యాలయం.

వారణాసి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ