ప్రకృతికి చేసిన సన్మానం
ప్రకృతికి చేసిన సన్మానం
అరణ్యాల వెంట వూర్లు
వెలసినప్పుడు
తెలియలేదు వారు ఈ పని
చేస్తారని,
మానవుల నివాసం
కోసం
భూమి కావలని
అడవులను చేరారు,
నిప్పటించారు,
భూమిని సాగు చేశారు.
అడవిలోని గిరిజనులను
తరిమినప్పుడు
తెలియలేదు, వారు
జంతు జాతులను దూరంగా
తరుముతారని, ధనం కోసం, ఆటవిడుపు కోసం వేటాడుతారని
వారు సాటి మనుషుల పట్ల,
మా పై చూపే మానవత్వం
ఏమిటో, ఏంతటిదో తెలిసిందప్పుడే.
అభయారణ్యాలు పేర చట్టాలు
తెచ్చి,
అడవి బిడ్డలను
నియంత్రించి,
అటవి రక్షణ పేరుతో కేసులు పెట్టి,
చేతి వృత్తికి దూరం చేసి
పోట్టకొట్టి,
గూడు పడగోటారు అడివి
నివాసానికి దూరం చేశారు.
జంతుకోటి పై వారు చూపే
ప్రేమాభిమానాలు
జంతుశాలలో చూస్తూనే
వున్నాయి జంతువులు
ప్రాథమికరంగం ఆధిపత్య మనసు ఒకటైతే కార్యనిర్వహక మనసు మరోకటవుతుందా
సాటి మనుషుల పై దాడి చేసే స్వాభావం నిలుస్తూందా...
అమానవత్వం నా పై చూపుతుందా
ఈ క్రౌర్యం వలసవాద తత్త్వం
జాతి, మతాల పేరిట
చంపుకోనే ఈ మానవ అరణ్యం
నన్ను గేలి చేసి నా
బిడ్డను పొట్టన పెట్టుకోవడం వింతేముంది
అవును యింతకిది జీవనోపాధి విధానం కదూ..
వారి ఈ మానవ జన్మకు
ఉత్కృష్ట చేష్టా కదూ..
నా నిర్భరం ముందు వీరెంత
నా శరీర బాధకు వూరిపై బడి
కనిపించిన నలుసులపై
బడితే ఏమౌతారు
తల్లినైన నేను
బిడ్డకు పాలు ఇవ్వాలిగాని
చెయి చేసుకోసుకుని హాని కలిగిస్తానా
నా అడివి తల్లి నన్ను
అమ్మగా ప్రేమ చూపమంది
వారు పెల్చిన నా ముఖంలోని
గాయం బాధను తట్టుకొని
నా గర్భంలోని బిడ్డ
ప్రాణ రక్షణే నా ధ్యేయమైంది.
ఈ మానవ చర్య
వారు ప్రకృతికి
చేసిన సన్మానం...
పోల బాల గణేష్
పరిశోధకుడు, తెలుగు శాఖ
కాశీ హిందూ
విశ్వవిద్యాలయం,
వారణాసి.05-06-2020.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి