తరాలకు తరగని గని నేను

 


తరాలకు తరగని గని నేను

వివక్ష రంగుకే అనుకున్న

కాని విద్యకు కూడా ఉందని తెలిపింది భారతం

నా కవన నైపుణ్యం ఎంత మెచ్చిన లోనారసి చేసిందే

నా జనాభాను చూసి సిట్లు ఓట్లు

నోట్లు ఉద్యోగాలు పదవులు పొందడానికి

నా బోమ్మ పెడతారు కాసేపు నన్ను స్మరిస్తారు

నా రచనలను చర్చిస్తారు మేధావులు

ఆధునిక ధృతరాష్ట్రులు

గాంధారి వీర విధేయులు

మరేమో మహామహోపాధ్యాయ పూల్లేల1 వారు

ఆర్యులు లేరు వర్ణం లేదు అందరూ భారతీయులే అంటారు

స్వార్థచింతనతో నాడు అప్రకటిత

నేడు ప్రకటిత ప్రయోజనాలను ఆశించి, పాటింప చేస్తూ సౌక్యం పోందుతున్నారు

నేటి ఆచార్యులు మాత్రం నా మూలం మరవకుండా దత్తాత్రేయ మంత్రం జపిస్తారు

మరి ఏ ఫలసిద్ధి కోసమో....

విశ్వమానవులు మీరు నేడు కాశీలో గెలిచారని వక్కాణించారో మహాత్ముడు

జంకు లేకుండా ముందుకు అడుగు వేసిన కవిని నేను

నానాపాట్లుకు పడ్డాను

గోదావరి వడ్డు దాతృత్వం

నెల్లూరి ఆర్థిక ప్రోత్సాహం

నేను మరవను

ధర్మాలు ఎన్ని ఉన్న

మానవ ధర్మం పాటించ్చు

పొట్టకొట్టి జీవితాని మోడు చేసే

ఆలోచనలతో రాక్షసానందం పొందమాకు

నా కోసం కాదు

నీ కోసం

మీ పిల్లల కోసం

ఏడ్వండి

సంపదను పోగేయండి

వనరులను ఆస్వాదించండి

నన్ను అడంపెట్టుకొని

నడుపుతున్న నటనల సారం తెలుసుకున్న

నీతరం ఒక్కటే బాగుపడాలి అనుకోవడం లోభం

ఫలాలను పంచిపెట్టు సమాజం కోసం ఆలోచించు

నీ శారద ఎక్కడికి పోదు

నీ వంటి విశారదలను శతకోటి మందిని తయారు చేయ్

 ఆంక్షలు లేకుండా భృత్తి ఇపించలేరు

                                                             మీ భృత్తితో తృప్తి పడుట మంచిది                                                      

 నా ఆత్మకథ  నేటి విద్యార్థిలోకానికి  వెలుగు

మీ చేత్తులు ఆ కాంతిని అడ్డుకోలేదు

ఇదే నా పుట్టిన రోజు సందేశం

ఇట్లు

మీ

(అదే మన)

గుర్రం జాషువా

పోల బాలగణేశ్, పరిశోధక విద్యార్థి

(ఆచార్య చల్లా శ్రీరామచంద్ర మూర్తి గారి పర్యవేక్షణలో సిద్ధాంత గ్రంథం సమర్పించాను 20-02-2020),

తెలుగు శాఖ, కాశీ హిందూ విశ్వవిద్యాలయం

వారణాసి-221005. 28-09-2020.

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ