కళా తపస్సులకు వీడ్కోలు

సరిగమలు సాధన చేస్తే

అదే నా జీవనాధారం అయింది

శ్రద్ధాభక్తితో గానం చేస్తే

అఖిల భారతావని అక్కున చేర్చుకుంది

ప్రతీ గాయకునికి తనంతటి వానిగా ఎదగాలనే

తపనతో నన్ను ఒ  శిఖరాన్ని చేసింది సంగీతం  

నేపథ్య గేయమే  నా ప్రాణమై ప్రణవమైంది

స్నేహ వాత్సల్య ప్రేమాభిమాన భక్తి మాధుర్యమే

నన్ను శ్రోతల హృదయాల్లో పదిల పరిచింది

ఓర్పు నిటూర్పుల

ఉత్సాహ గాన గమనమే

జీవికను స్థిరపరిచింది

ఇహ సాక్షాత్ సకల కళా మూల స్వరూపిణినైన సరస్వతీ దేవి

స్వర్చానకు దివికి ఏగుతున్న

దివ్య కమలచరణ ఉపాసనతో దివికి ఏగుతున్న

స్వర గాన నైపుణ్యంతో దివికి ఏగుతున్న

రాగ తాల లయాత్మక పాటల సంపదతో

సంగీత శాస్త్ర పటిమతో  

గంధర్వుల జయ జయ నాదాలతో దివికి ఏగుతున్నాను

మీ గాన గంధర్వుని దివికి ఏగుతున్న

కళా తపస్సులకు వీడ్కోలు.

       -పోల బాలగణేశ్, పరిశోధక విద్యార్థి, తెలుగు శాఖ,   కాశీ హిందూ విశ్వవిద్యాలయం

వారణాసి-221005. 26-09-2020.   కవిత రాయమని ప్రోత్సహించిన రుత్తల శ్రీధర్ గారికి కృతజ్ఞతలు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ