స్థిరత్వానికై
స్థిరత్వానికై
నిత్య జీవితంలో తెలిసిన విషయాలు కొన్ని...
తెలియని వివక్షలు ఎన్నో.... తెలిసేలోపే
వేటుకులోనై నేను.
కాలం తిరిగి రానిది,
జ్ఞానం నాశనం కానిది.
లోక వ్యవహారం తెలిసి నడిచినా,
స్వీయ చపలత్వం
సాధన చేసి నిలిపిన శ్రద్ధను బలహీనపరచినా,
సడలిపోయిన పట్టుదల
నైరాశ్యంకులోను చేసినా,
చేవకు పురికోల్పలేక చతకిల పడ్డేలా చేసినా.
నత్తనడకలా జీవితమున్నా
స్వల్ప ఆనందాల సంతృప్తి చేందినా....
తృప్తిపొందక....
స్థిరత్వానికై పోటి లోకానికి వేళ్తున్నా...
ఇక కాల నిర్ణయమే.........
వెయ్యి ఓటములు ఎదురైన తిరిగి ప్రయత్నిస్తా.
విజయుని అవుతా.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి