సుప్రీమ్ కి సమయం లేదు!

Chief Justice of India (CJI) made headlines by refusing to urgently hear a plea regarding the recent police crackdown on student protesters at Jantar Mantar, telling the lawyer, "Don't waste our time, and don't waste your time." The protesters belong to the "Cockroach Janata Party," a group catalyzed by CJI 's earlier, unrelated remarks where he had likened certain unemployed youth to "cockroaches." [1, 2, 3]


సుప్రీమ్ కి సమయం లేదు! 

జెన్ జీల తోకలను వెలిగించి,
ఊరుకున్న సుప్రీమ్ ప్రభూ...
మావీ నినాదాలు కావు,
మా భవిష్యత్తు పదిలం చేసుకోవడానికై ఆరాటం.
సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష కనిపించదూ..!!
కళ్ళు తెరిచిన న్యాయ దేవత  ప్రధాన సేవక గణ నాయకునికి.!

ప్రధాన న్యాయదీష్ గారు ఏ పని పాట లేక కాదు స్వామి 
 మా అవకాశాలను 
అక్రమంగా దోపిడి చేస్తూన్న 
స- వర్ణ- సంపన్న - కార్పోరెట్ల 
బ్రో కాట్ల సంతాన 
ఉన్నతోన్నత స్థానాలకై  
చేసి - చేస్తున్న, చేయబోతున్న
 పేపర్ లీక్లు - నీట్- జే.యి.యి., ఎస్.ఎస్.ఈ. స్టేట్ పబ్లిక్ , 
తదితర పరీక్ష పేపర్ల లీకులకు వ్యతిరేకంగా  చేసే పోరాటం.
 మాది కాదు రాజకీయం - ఎన్నికలు కావు మా  లక్ష్యం.
బొద్దింకలమే
 వంట గదినిండా వ్యాపిస్తే నీవు చేసేది రీ బిడ్లింగ్.
మేము చేస్తే నూతన ప్రభుత్వ నిర్మాణం.
అడ్డుకావు నీ మహిళా బిల్లు, నూతన నియోజకవర్గాల పుర్నిర్మాణం.
వెయ్యి గొడ్డులను తిన్న రాంబదు ఒక దెబ్బతో చచ్చినట్లు
ఒకే దెబ్బతో దేశ అత్యోన్నత్త ధర్మ మూర్తిగారు,
 ప్రదాన నాయకుని  
అహంకార చిహ్న విద్దెమాత్య దర్పణం నిట్టనిలువున పగిలిపోయింది.   
 

న్యాయం కోసం నినదిస్తాము.
మహోగ్ర ఉద్యమ బాటలవుతాము.
మీ పతనం మా భవిష్యత్తుకు పునాది.
తలలు పగలగొట్టిన, 
కాళ్ళు విరిచిన, రొమ్ము చూపిస్తాము.
నాగపూరు కర్రలు మాపై ఎక్కు పెట్టిన
పోలీస్ మాఫిలై దాడి చేసిన,
అవోబిపిలు 
మారువేషంలో,
 బాజపలు నిర్భయంగా మమ్ములను తరిమినా,
నీట్ పరీక్ష రద్దుతో ఆత్మహత్య చేసుకున్న వారి న్యాయానికై,
 దేశ యువత భవిష్యత్తుకై 
కేసులకు, జైళ్ళకు  వెనుకాడము. 
ప్రాణాలను సైతం త్యాగం చేస్తాం. 
గోది మీడియా అసత్యప్రచార ఆర్భటాలు,
నిక్కర్లు చేసిన  దాడులను,
  పోలీసుల వాహనాలను తగుల పెట్టారనీ చూపే ఘటనలను,
మేమే చేసామని ప్రచారం చేసిన
 బెదిరెది లేదు, అదిరేది లేదు.
పారదర్శకత లేని మీ పాలనను సహించలేము.
మానవ హక్కులను లెక్క చేయని బాధ్యత రాహిత్య ప్రభూతకు తలొగ్గలేము. 

ప్రతిపక్ష నాయకులు  ఏమి చేసినా ,
యువత పై చేసిన దాడికై మద్దతును కూడా, 
రాజకీయం అంటున్న,  
అమానవ చర్యలను, అరాచకాలను కానక
 అవాస్తవాలను వ్యాప్తి చేసే   
మోడియ సామగానాల బృంద
 వార్తలను ఖాతర్ చేయము. 
ప్రజా చైతన్యం ముందు మీ సాముగరిడీలు సాగవు. 
మూడో నేత్రం చూపును సర్వస్వం
చైతన్యం
సమీకరణం
సమూహిక పోరాటమనే అంబేద్కర మార్గ పయనమే మా ధ్యేయం. 

























కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నీతి శతకాలు – మానవ జీవితాలకు ఆదర్శప్రాయాలు

అధ్యాపకత్వం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం