77వ స్వాతంత్ర్య దినోత్సం
77వ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వేడుక ఓవైపు
విశృంఖలమైన స్వేచ్ఛ మరోవైపు
స్వాతంత్ర్యం స్వార్థపరుల పైశాచికానందం
పేదబీదలకు వైద్యం చేసే మహిళ డాక్టర్ను
స్వేచ్ఛ స్వాతంత్రం బలితీసుకుంది.
స్వేచ్ఛ సత్యాన్ని కప్పి ఆత్మహత్య అంది.
స్వా- తంత్రం ప్రిన్సిపాల్ ని
పెద్ద మేడికల్ కాలేజీకి బదిలీ చేసింది.
స్వా తంత్రం ఇప్పుడు నిందితుడు
దొరికాడు అరెస్ట్ చేశాము అంది.
పోస్ట్ మార్ట్ రిపోర్ట్ వ్యక్తికాదు
సామూహిక అత్యాచారమని
తీవ్రమైనగాయతో హత్య చేశారని నిజం పలికింది.
కలకత్తా ప్రభుత్వమే మహిళపై మమత చూపి ధర్న చేస్తుంది.
హైకోర్టు ఆదేశంతో
సిబిఐ నేరపరిశోధన చేయడానికి సిద్ధమతుంది.
పోలీసు బాస్ మీడియాకు తల ఎత్తకుండా
సామగానం చేశాడు.
ఇంకా
నిందిత- బాధితురాల బైయోడేటాన్వేషణలో
రాచ కీయ కీచకుల
వ్యూహాకర్తల
రచనోపాయాలకు సాన పడుతున్నాయి.
శిక్షాస్మృతి కఠిణ శిక్షలకోసం పేజీలు తిప్పుతుంది.
స్వేచ్ఛగా తిరుగుతున్న నేరాని ప్రతిఘటించలేని ప్రజలు
తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.
స్వేచ్ఛ స్వాతంత్రం కదా అంతే మరీ
స్వా తంత్రం లో స్వేచ్ఛ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి