శుభకృత్
శుభకృత్ శోభను చేకురుస్తూ ముందుకు వచ్చింది
మామిడి చిగురు తొడిగినట్టు
నూతన ఆశలను ఆశయాలను
కాలం సంచిలో వేసుకొని వచ్చింది
శుభకృత్ ఉగాదిలో నూతన జీవితాానికి
షడ్రుచుల ఆస్వాధనను తెనుంనది.
మధ్యతరగతి ఆర్థిక నడుము విరుగుతున్న
నిరుద్యోగులు ఉద్యోగమో రామచంద్రా
అంటున్నా వేళ
శుభకృత్ శుభాని చేకురుస్తూ....
ఆకలికి అలమటించి
గూడులేక దారి తెన్నులేక
నలిగిపోతున్న వేళ
ఈ శుభకృత్ వత్సరం పేదలకు చేయందిస్తూ....
సకల కల్మషాలతో
కుటీలాలోచనలతో
పైకి అమృతతపు చిరునవ్వును చిందింస్తూ....
అంతరంగంలో హాలాహలం పెంపోదింస్తూ....
పైకి దివెనలు కురుపిస్తూ
లోన అధః పాతాళానికాంక్షిస్తూ....
మనుషుల మధ్య నున్న వేళ
విశ్వాసానికి కపటానికి తేడా ఎరుగని
సంకుచిత చిత్తుల నడుమ ....
శుభకృత్ శుభాని....
యూద్ధం శాంతి అంటూ ప్రపంచం చిందరవందరగా ఉన్న ఈ వేళ
శుభకృత్ వస్తుంది.
మేధావులంతా కమలనాథులకు తాళాలు మోగిస్తూ...
ఆశ్రీతులకు అద్దలం ఎక్కించడానికి విశ్వయత్నాలు చేస్తూ...వేళ
రాజ్యాంగం విస్మరించి సౌభ్రాతృత్వం అంటుంచి
సామ్యవాదం మరిచి ప్రైవేట్ పథం పట్టిన వేళ
శుభకృత్ శుభాని తెస్తుంది.
మాయమాటలతో ఆరవై సంవత్సరాల ప్రణాళిక అంటూ
కమల పథం వైపు బ్రెయిన్ వాష్ చేస్తూ...
రోజు రోజుకు గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు జి యస్ టి లో లేదు అంటూ
యూద్ధం బూచిని చూపి పెంచుతూ....
నిత్యవసరాల ధరలు పెచ్చి
కేంద్ర ఉద్యోగుల బొచ్చెలో ఇంత డి.ఎ. ముష్టి వేసి
ఆడుతుంది నాటకం
పేద, మధ్యతరగతి , నిరుద్యోగులు
కనబడరు వ్యాపారసామ్య ప్రభుతకి
వస్తుంది వస్తుంది వస్తుంది
శుభకృత్ వత్సరం
శుభాలను వెంట తీసుకొని వస్తుంది
నవభారత యువలోకంలో నూతన చైతన్యం తీసుకువస్తుంది
శుభకృత్ శోభను చేకురుస్తుంది.
డాక్టర్. పోలా బాలగణేష్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి