ఉగాది కవితా చదవండి మీరిక


ఉగాది కవితా చదవండి మీరిక

ఉగాదులు మానవ కాల చక్రాన్ని తెల్పిన

మనోవేగానికి అవధులెక్కడా..!?

విచిత్రాది నేతలతో

బాకాల గోలలతో

పట్టి పీడిస్తున్న సమస్యల నుండి కాస్తా దూరంగా

హృదయాని రంజింపచేద్దాం.

పచ్చని మామిడి చిగురులు

తీయని కోకిల స్వరాలు

కైపెక్కిన తనువు

శృంగార దేవత లేక

ఒళ్ళు విరిచిన ఇక్షువిల్లుకాడు(మన్మథుడు).

ఎండలకు తాళలేక

వరదకట్టిన చెమట ధారలు

చిక్కని-చక్కని సౌందర్యాధనకు

మరో మారు స్వాగతం పలుకుతూ

ఈ ఉగాది పిల్లి మొగ్గలేస్తూ ప్లవగా

సమృద్ధిగా సస్యశ్యామలంగా జల కళతో దర్శనమిస్తుంది.


విజృంభిస్తున్న కరోన

మందులు మాకులు లేక టీకానే

శరణ్యమైన వేళ

అదీనూ

అందరికి అందుబాటులో లేక...

ఆహా నాయకుల హేలా...



అవునూ మనసును రంజింప చేయాలి కదా

బాంధవ్యం ఏమిటో

బంధువు ఎవరో

స్నేహం ఏవరిదో

చుక్కలాగా అంత మంది ఉన్న  తనను చేరుకోన్నా వాళ్ళు ఎంత మంది.

తీయని ఫలాల కోసం

ఆశగా చూసే ఈలోకం

కొత్తగా ప్లవ నామ సంవత్సరం ఏమిస్తుంది.

ఇస్తుంది మా నవ లోకానికి

ఓ ఓదార్పు ఓ విజయపథం

సౌందర్య లాలసాన్ని, సామాజిక సమస్యలను

సమపాళ్ళలో మిశ్రమించి  చూచిన

తనువుకు, మనసుకు ఆనందాన్ని, ఆధ్రతను, కలుగజేస్తుంది.

మనోనేత్రాలను వికసింపజేస్తుంది.

మానవత్వాన్ని మేల్కొల్పుతుంది.

భూటకపు వేషాలతో మొఖాలకు మాస్కులు తోడిగిన

అసలు తనం ఏమిటో త్వరలోనే తెలుస్తుంది మరి..



అవునూ ఇంతకి మనసును రమియింప చేయాలి కదూ..

స్వచ్ఛమైన పాల నవ్వుల చిన్నారులు

కపటంలేని చిన్నావాళ్ళ స్నేహాలు

బోసి మొఖాలతో ఆదరణ చూపే అమ్మమలు తాతయ్యలు

బతుకు వేతల నుండి దూరంగా

తీసుకోనిపోతున్న కవులు...

శుద్ధ హిందోళ రాగాల వీణా నాదాలు...

ఒళ్లు గగుర్పొడిచే ఉపన్యాసాలు...

నవజీవన సుందర చిత్ర దృశ్యాల ఆస్వాదనకు,

ప్రకృతి రమణీయత రాగాలు

ఇవేగా నేటికి ఆకర్షనీయాలు.

డా. పోల బాలగణేశ్

తెలుగు అధ్యాపకులు,

తెలుగు శాఖ,

డి.యన్.ఆర్ డిగ్రీ కళాశాల,

భీమవరం.

మీత్రులు కవిదాసు గారి ప్రోత్సాహం మేరకు రాసిన కవిత ఇది. వారు నిర్వహిస్తున్న ప్లవ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనానికి నన్ను ఆహ్వానించారు కాని కరోనా కారణంగా హాజరుకావడం లేదు. వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ....



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ