అధ్యాపకత్వం

అధ్యాపకత్వం

దరఖాస్తులు నింపిన నిరాశతో వెనుదిరిగిన రోజులున్నా,

                                    మౌఖిక పరీక్షలో విఫలమైన,                                  

అనుభవం లేశమాత్రమైన లేకపోయిన విషయాసక్తి ధైర్యమిస్తుంది.

ఏ రోజుకైన పాఠం చెప్పకపోనా అనే ఆశావాద దృక్పథం నిత్యం ప్రోత్సహిస్తోంది.   

 ఈ తపనంతా చదివిన చదువుకు సార్థకత్వం సాధించుకోడానికే.

తొలిసారిగా అధ్యాపక వృత్తిలో చేరిన రోజు 

మొదటి గంట కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న క్షణాలు ఇవి.

వికశిస్తున్నా విద్యార్థుల మనసులు గెలుచుకోవడానికి వెళ్తున్నా క్షణాలివి.

  తరగతిగదిలోకి అడుగు పెడుతున్నా...

పాఠం చేప్పడం ఒక్క కళ.

 ఈ కళను  సాధన చేయడానికి  ప్రయాణం మొదలైన వేళ.

సామరస్యంతో, ఔదార్యంతో,

నేర్పు, ఓర్పు, జ్ఞాన, విజ్ఞానల కూర్పులతో  

 ముందుకు వెళ్తాను.

 ఉపాధి చూపి అభివృద్ధిలోకి వస్తానని విశ్వసించిన

కళాశాల యాజమాన్యానికి సదా కృతజ్ఞతలు.

సహృదయంతో ఆశీర్వచనం ఇచ్చిన

తల్లిదండ్రులకు, గురువులకు,

స్నేహితులకు, నా శ్రేయోభిలాషులకు,

అందరికి నమస్సులు.

                                

                              - డా. పోల బాల గణేశ్.

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నీతి శతకాలు – మానవ జీవితాలకు ఆదర్శప్రాయాలు

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం