నా ప్రియసఖి
నా ప్రియ సఖి
చిక్కనై రాత్రిని తలపించే పరిమళ భరిత వాలూ జడా
చూపులతోనే కట్టిపడేసే నేరేడు కన్నులు
చెక్కిళ్ళు లేలేత ఎర్రని పద్మాలు
చిరునవ్వుతో మనసును ఆహ్లాదపరిచే మోము
జుంటి తెన్నేధారల వంటి పలుకుల చిలుక
వెండి కొండలా నువ్వు
నవ యౌవన శిల్పాకృతి నీ తనువు
పులకింపజేసే స్పర్శవు
ఇంతటి సరసు(జ్ఞు)నికే ముచ్చమటలు పటించే పండితానివి
కష్టాల్లో ధైర్య రూపిణి, ఆపదలో సౌర్యరూపిణిఆత్మాభిమానంలో అభినవ సత్యభామవు
ధృడమైన ఆత్మవిశ్వాసానివి
సడలని నిర్ణయ గాంభీర్యానివి
లలిత కళలన్నింటికి సౌందర్య నేపథ్యానివి
చిన్నలతో కలసి ఆటపాటలతో సవ్వడి చేసే చిన్నారివి
స్నేహానికి మరో రూపానివి
హాస్య ప్రియ, సంతోష రూపుణి
బుద్ధి సిద్ధివి
మంగళ స్వరూపిణి నీవు
ప్రియ సఖి
కరుణ రాదా, చేరగరావా
గమనిక - ఈ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు .
పోల బాలగణేశ్.
Excellent 👌
రిప్లయితొలగించండిSuper 👌
తొలగించండి