ఆనంద విహార్
పరమ పావన హిమనగ జన జీవ నది
గంగా
ఉత్తరముఖంగా ప్రవహింస్తున్న అతి ప్రాచీన నగరి కాశీపురి
గణ గణ గంటా నాధాలే కాదు
కణ కణ మండే కట్టేలే కాదు
కఠోక్తిగా శుద్ధ శబ్దోపాసనతో
ఉదాత్త అనుదాత్త స్వరితాలతో
లయాత్మక వేద పఠనం నిత్య శ్రోత్రీయమే కాశీ క్షేత్రం
పరమ పౌరాణికుల నిత్య ఆనంద నిలయం కాశీ
ఆరవైనాలుగు కళలకు రాజధాని కాశీ
కాలే కడుపుల ఆకలి తీర్చే అన్నపూర్ణ మాత కాశీ
జ్ఞాన దాహం తీర్చి ముక్తి మార్గం చూపే పరమదామం కాశీ
తాత్వీకాలోచనల విశ్వసానంద కేళ్ళుల స్థిర నివాసం కాశీ
చిత్రమైన జీవనం చీకు చింతలేని పయణం కాశీ
భక్తి తన్మయం విరాగ రంజితం కాశీ
సుప్త చేతనల జాగృతావస్థల డోలాయమానం
సప్త చక్రాల ప్రేరేపిత దివ్య నగరి కాశీ
గిరి గీసుకోన్న, గిరి గీసుకున్న
మానవుల దేహాల అగ్ని శీఖలు ఏగుస్తున్న స్థలిలో
ఎవరు ఏ వర్ణం, ఏవరికి ఈ దూరం
దేహా, ఆత్మల ఆటల నడుమ నిజ దర్శనమే కాశీ
దవల వర్ణ స్వరూపులం శ్వేత హస్త జపమాల దారులం
అనునిత్యం హనుమాన్ స్మరణులం
సీయారామ్ భక్తులమ్
మా దుర్గామాయికి చరణ్ స్పర్స్ సే ఆశీర్వాద్ లేతీ హై
యే కాశీకి సంప్రదాయ్
జీదంగి జీనేకేలీయే యహా అయియే
కాశీ మార్మికతను అనుభవిస్తే
కాశీయే నేను అవుతాను
కాశీయే మీరవుతారు
అలౌకికానంద లౌకిక జీవన సంమేళనమే కాశీ
మరుగునున్న రహాస్యాల సారం
పై మెరుగుల స్నానం
విఠాలాక్షుని కంటి నీరు రుద్రాక్షం
విశాలాక్షి శక్తి పీఠం చిద్విలాసం దర్శులం
బిందుమాధవుని తోలసి మాల కంఠదారులం
కాశీ నివాసులం.
లోకైక స్థిర నిశ్చల ఆవాసం కాశీ
కాశీలో నడుస్తునంత సేపు తెలియదు దూరం
అగితేనే అంటుకుంటాయి అలువాట్లు
మణికర్ణికలోని ప్రథమ చిత్తి భస్మమే తొలిపూజ ద్రవ్యం
నుదిటిపై దుద్దిన చందన సుగంద సువాసనల సౌందర్యం కాశీ
నిత్య చరవణం తాబులం అదే కాశీ చిహ్నం
జటాజుటాలతో గంగా స్నానం
కాశీ క్షేత్రపాలికతో సంచరించి
శిష్య ప్రశిష్య తాపసుల
సేవలో నేనుండి శివోహం శివోహం
శివోహమే కాశీ
ఇహాలోకం అనటం కన్న పరలోకమే కాశీ
భయపడితే భయమే మిగిలుస్తుంది
విజేయుని అనుకుంటే అజేయుని చేస్తుంది.
సమస్త ఆదివాసులు నడిచిన, జీవించిన
విశ్వేశ్వరుని నివాసమే కాశీ
సంగీత సాహిత్య విద్వాంసుల ఖ్యాతి కాశీ
షహానాయి బిస్మిల్లా ఖాన్ కాశీ
సీతార్ సప్త స్వరాల
హిందూస్తానీ రాగాల విశ్వ విఖ్యాతుల పండిట్ రవిశంకర్ ల కాశీ
ఆది శంకరుల జ్ఞాన ఘోష కాశీ
శంకరుల నిత్య పూజిత కాశీ
శంకరుల ఆదిమాతను సేవించిన కాశీ
సకల శాస్త్ర నివాసిని కాశీ
ఉపనిషత్తు జ్ఞాన ప్రవాహిని కాశీ
ఆగమ సాంప్రదాయ భాష్యం కాశీ
సర్వమత ఎకైక రూపిణి కాశీ
పుణ్య పురుషుల ఆధ్యాత్మిక నగరి కాశీ
అవదూతల, సర్వ సంఘ పరిజ్యీతుల, జీనముక్తుల, గురు దేవుల కాశీ
నిత్యప్రకాశీత దేవనగరి కాశీ.
పోల బాల గణేశ్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి