మోదీయం(డ్) కమనీయం రమనీయం


 మోదీయం(డ్) కమనీయం రమనీయం 

ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని

అదే ఖగోళాంతానికి నాంది.

ఓటరు

వెంట తిరిగే వారు వెన్నుపోటుదారులని తెలిసిన....

చుట్టున్న వాళ్ళు గుంటనక్కలని తెలిసిన...

కన్నవాళ్ళు జాగ్రత్త చెప్పిన...

భుజకీర్తిలు వెంట నడిచే వారి కీర్తిదాహం

అనంతకోటంత ఆరాటం....

అయిన... పోల్ అయ్యాయి.

ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని

అదే ఖగోళాంతానికి నాంది.

నేతి నేతి నీతై

కూట నీతి

కూటి నీతి

లేనివాని కడుపు కొడుతున్న....

తెలియని వానికో విధానం...

రహస్యం తెలిసిన వానికో పద్ధతి...

ఇదే ఘన భారతావని ఘన కీర్తి

మానవ జన్మే ఎందుకనేలా జీవనగమనం....

ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని

అదే ఖగోళాంతానికి నాంది.

 జీవ మనుగడే జలం విజృంభణమే విశ్వ విధ్వంసం

అనంత సృష్టిలో ప్రకృతి ఆవిర్భావ వినాశనాలేంత సహజమో

పతనం అంతం అంతే సహజం

వ్యవస్థలన్ని విషాలు చిమ్మే

సహస్ర తలల ఫనులయ్యాయి

గోవు హస్తాల తోడ్పటుతో

పడగ పడగన ఎదిగిన వికృత నాథులున్నారు

వెయ్యి కన్నుల  ఈర్ష్యాసూయపుటాలోచనల వక్రదృష్టులు

చక్రవ్యూహాచతురులు కమల చరణులు

శరణు శరణు వేడు కైమోడుపుల అహంకార భావా లోచన మూర్తులు

శవాకారాల ఆహాకారాలు ఆనందకేలిళ్ళు

గజకర్ణగోకర్ణులకు వంతపాడటమే తెలిసిన బ్రహ్మ విద్యావేత్తలు

అంచె అంచేలుగా విభజించిన

మానవ బ్రతుకుల జీవనం

                                                      

  

ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని

అదే ఖగోళాంతానికి నాంది 

గాలికి తేలిన అకశేరుకాల మేధావులను

ఆడించే మాటల, రాతల గారడీ గరిమ ప్రకటించే గాంధేయులు

స్వాతంత్ర్యం మాటున సమత మమతల పేరుతో

నర నరంలో జీర్ణింపచేసిన వర్ణ కుల మత భావాలు

హైందవ ధనస్వామ్యులనుకూల పాలన దక్షులు

ఉన్నతోత్తమ భావ వ్యాప్త సాహితీ  దర్శ వాణీశ్వరులు

సేవలర్పించు బహు వృత్తుల సామగానం

సహపాఠిల, మేళకర్తల భజనగాళ్ళు వారికి వారేసాటి

ఎల్లప్పుడు కరుణార్థులమై నోటు ఓట్లమై కాపాడుతూ......

చాణక్యంతో కడుపుకొట్టిన...

రక్షణకై కలుగును ఆధ్యాత్మిక జ్ఞానం

ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని

అదే ఖగోళాంతానికి నాంది

రగిలే ఉదరంతో రేగును దేశీయ జాతి వైర్యం

తపః ఫలం మేమో

రణోత్సహ ధీర దేశోద్ధరక ఏలిక మేలు ఇక...

కవన వాల్మీకి కన్న కాళిదాసుల

రాఘోత్తముని పరమధర్మ విధిని పాటిస్తూ....

రామ నామ స్మరణతో సరయు నది తీరాన

అజరామరమైన మందిర నిర్మాణం

ఆదో దేశానికి ఇచ్చిన సుప్రీము బహుమానము


 కరోనా సర్వవ్యాప్తమైనాక

పేద, మధ్యతరగతి రైలు రవాణా సౌకర్యాని ప్రైవేటు పరం చేసి

లాంక్ డౌంవున్ ఆట ఆడిస్తున్న గారడి గరిమ పాలక

అన్నదాతల  కష్టాన్ని కాజేసి

సంపన్నులకు దోచిపేడుతున్న వ్యాపారిక...

విజ్ఞానం లేదు శాస్త్రీయమైన ఆలోచన లేదు

నిర్హేతుకమైన జీవనమే చాలునని చూపును యోగ నైపుణ్యం

అసంబద్ధమైన పౌర నమోదు విధి విధాన రూపకర్తా

అడవులను రాబందుల పాలు చేస్తున్న కమల ప్రభుతా

జార్ఖండ్ ను కబలిస్తున్న మైనింగ్ అభివృద్ధి నాయక

 పాలనకు తెచ్చిన వారు ఇచ్చేనా

పెట్టుకున్నవాడు పేట్టున బిక్ష

తెచ్చి –పెట్టుకున్నవాళ్ళు అనుగ్రహించేనా

శతకోటి వికృత భావాల ఏకరూపం

అడుగడుగున కుట్రల సమైక్యతవు

కట్ట పెటేరా నీకా కూర్చి

లభించేనా ఆత్మనిర్భర భారత భావి పదవి.

ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని

అదే ఖగోళాంతానికి నాంది.

 

పోబాగ, కాశీ హిందూ విశ్వవిద్యాలయం.

వారణాసి. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ