అక్టోబర్ మాసం

అక్టోబర్ మాసం

వరుణుని అవిచ్ఛన జల్లుల

సవ్వడిలో వాగులై వంకలై

ప్రవహించిన నదినదాలు

పచ్చదనంతో పుష్పించిన

ప్రకృతి పచ్చని చీర సింగారం

కొండ శిఖరం నుంచి వీక్షిస్తున్న అనుభూతి పారవశ్యం

 సునిశిత హృదయంలో

సౌందర్యానంద హరివిల్లు వెల్లివిరుస్తుంది.

వర్ష రుతువు నుండి

చలి కాలం వైపు నడిపే

మాసం అక్టోబర్

నులివెచ్చని చెలి కౌగిలిలా

మనోహరంగా సాగే

పచ్చకర్పూరపు పారజాత పుష్పాల సుగంధ పరిమళ గాలులు

 తీగలు తీగలుగా సాగుతూ తనువును

పులకింప చేస్తుంది.

 మనసును రంజిప చేస్తుంది.

తెల్ల తెల్లని తెలవారు జామున

సాయం సంధ్యా సమయంలో

చల్లని గాలుల స్పర్శ వింత సోయగాల

రాత్రి పగళ్ళు

వేడివేడి టీలు

చాట్ మసాలాలు

డీఫ్రై చేసిన మముస్సూపులు

చెలి వెనుక కుర్చున్న  బైకు రైడింగు

ఓ నూతన ఆహ్లాద వాతావరణం అలుముకుంటుంది.


 

మధుబన్ తోటలో గువ్వల జంటల కోలహలం

మయురాల స్వేచ్ఛ విహారాలు

గంగా తీర ఘాట్టులో

చక్కర్లు కొడుతూ

 చెలి నడుమున చేయి వేసి నడుస్తూ,  కబురు చేప్తూ

చలికాలంకు స్వాగతం పలుకుతూ

అక్టోబర్ మాసం మనో పుష్పాలు వెల్లువిరుస్తాయి

రజనీగంద సువాసనలు చుట్టుముడతాయి.

చిత్రమైన జ్ఞాన దాహంకు దారులు తీస్తుంది

దృవపు ఎలుగు బంటి లాగ  రాత్రి చలితో

చదువుతో కుస్తీ  మొదలవుతుంది

నందన వనంలో విహారిస్తూ 

అర్థరాత్రి చాయికి బి హేచ్ యు గేటు వైపు నడకలు

చల్ల చల్లని గాలులు

ఉత్సాహానంద నవ్వులతో ఆటపాటల

పయణం చేసి లంకకు చేరి

ఆ వేచ్చని నిప్పులకుంపటి వెడిని ఆస్వాదిస్తూ

ఎర్రని నోరును తెల్లని గంగ నీరుతో పుకిలించి

తేనీరు సేవించి  బనారస్ పాన్ చేతపట్టి

వచ్చిన దారిలో తన్మయి భావంతో

తిరిగి హాస్టల్కు

చేరే వింత అనుభూతుల అనుభవాల  వెల్లువ

అక్టోబర్ మాసం.


పోల బాలగణేశ్,

పరిశోధక విద్యార్థి,

తెలుగు శాఖ,

కాశీ హిందూ  విశ్వవిద్యాలయం-వారణాసి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ