మేము ఎందుకు చేయకూడదు ?
మార్పించండి మారే
ప్రయత్నం చేయండి
“ విలువ, నీతి నిజాయితి - ఈ మూడు కలిస్తేనే ధర్మ
ప్రతిష్ఠ సాధ్యమయ్యేది. ఈ మూడు అంశలతో ఉన్నతం కాగలిగినప్పుడే మనం ధర్మజ్ఞులం
కాగలిగేది.... వ్యవస్థ ధర్మబద్ధమయ్యేది... కుటుంబాలు సంఘటిత ధర్మానికి
నెలవులయ్యేది.. వ్యక్తులుగా మనం అధములం కాకపోవటం వ్యక్తి ధర్మం. కుటుంబాలుగా
కలతలకు, కార్పణ్యాలకు
ఒడి గట్టక పోవటం కుటుంబ ధర్మం. సామాజికుల మధ్య సమరసభావం నెలకొనేలా చూడటం సమాజ ధర్మం.
బాలెన్సింగ్ చేయటం వ్యవస్థ ధర్మం. ఇలా వ్యక్తిగానైనా,
కౌటుంబికంగానైనా,
సామాజికంగానైనా, వ్యవస్థ పరంగానైనా దిగజారకుండటం మానవ
ధర్మంలా కనిపించే సృష్టిధర్మం.... విశ్వ ధర్మం. ఇదే మన జీవనగీత (కొంత
కోణంలో గీతా రహస్యాలు మొదటి భాగం).”
-
డా. వాసిలి వసంతకుమార్
మేము
ఎందుకు చేయకూడదు ?
మేము ఎందుకు
చేయకూడదు
మా కుటుంబ
సభ్యులు
మాకు మా
జాతి గౌరవం
ఏమిటో మాకు
నేర్పారు
మా ముందే మా
చుట్టున్న
మనుషులను
మనుషులుగా
కాకుండా
జాతి పేర్లతో
పిలుస్తూ
వారిపై
అజమాయిషీ
చేస్తూ
భల్లే
చమత్కరిస్తూ
దేప్పుతూ
పాసినవి
వారి మొఖం
పై కోడుతూ
వారి శ్రమను
దోపిడి చేస్తూ
మా ముందే
వారిని
నఖశిఖ
పర్యంతం
ఎగాదిగా
చూస్తూ
సందు
దొరికితే చాలు
చేతులు
వేస్తూ
భలే
గమ్మత్తుగా సరదాగా
పచ్చి
బూతులు తిడుతూ
వారిని
ఎక్కడ ఉంచాలో
మాకు నిత్యం
కృత్యాల
రూపంలో
చూపిస్తూ
నేర్పారు
ఆ మాకేం భయం
మేమే అన్ని పార్టీలో ఉంటాము
మా వాళ్ళే
డియేమ్ లను మేనేజ్ చేస్తారు
మా అంకుల్స్
పోలిసులు
దాదాలు
బలంగా మాకు
కొమ్ముకాస్తారు
మరి
ఇప్పుడైతే
మా యోగిజీ
పరమ శాంతి
స్వరూపులు
భరణాలు
పోయిన
సంస్థానాలు
పోయిన
రాజ్యాలుపోయిన
వాటితోపాటే మహానీయులు
పోయారు
రక్తం మాత్రం అదే
ఈ రా జ్యాంగం
ముందు
దిగదుడుపే
మీకు
తెలియదు
చిన్నప్పుడు
నుండి
తల్లిదండ్రులు
బంధువర్గాలు
చూపిన
మార్గం ఇదే
ఇక మా రాజ
కీ య
నాయకులు
మా
అధికారులు
మా
న్యాయధీష్లు
అన్ని
వ్యవస్థలో
ఉన్న మావారే
కదా
ఇక
సాంకేతిక
సౌకర్యాల పుణ్యం
మా దర్పం
ఎక్కడికి పోతుంది
మాకుంది
మేము వయసుకు
వచ్చాం
మేము
అన్లైలో నేర్చిన
వాత్సాయణం
ప్రత్యక్ష
అనుభవంలోకి
తెచ్చుకోవడానికి
అవకాశం కోసం
వేతికాం
బలహీనులను
ఎలా లోబర్చుకోవాలో
సహజాధిపత్యం
నేర్పింది
ఆవేశం
మృగాలను చేసింది
ఆలోచనతో
కళ్ళు తేరుచుకున్నాయి
గోంతు, నడుములను
విరగ్గోట్టాము
నాలుకను
కోసేసాము
చావు
బతుకుల్లో
అల్లాడుతుంటే
మాతనం చూపాము
శవమై బుడిద
చేయించాము
సుప్రీమ్లు
కళ్ళప్పగించి
చూసాయి
పార్లమెంట్
వ్యవస్థ
కళ్ళు
చెవులు
నోరు
మూసుకున్నాయి
బాకాలు
తల్లి కూతుర్లను
తప్పుపట్టాయి
వర్ణం
పైకి
లేచిందని
నాలుగో స్తంభం
ఏడ్చింది
మరింత
వేదనలకు పురికొల్పింది
మరో సగం
స్త్రీ హింసా అంటుంది
అచ్చా దిన్లు
ఇలా వస్తున్నాయని మోడి
నాథాలు మారుమ్రోగాయి
బేటి పడాయి
కియా ఫిర్ బి
ఇన్కా అచ్చా
దిన్ నహి హై
మౌత్
హోగైయ్
హస్తం
హడావిడి,
దేశం
గగ్గోలు పేడుతున్న
నిర్లజ్జగా
చుస్తూంది
మా నవ లోకం.
ప్రశ్నించే
గొంతుకలు లేవు
ప్రశ్నించే
ధైర్యం చంపేశారు
ప్రశ్నించే
రోజులు కోసం
ఎదురు చూడకండి
ఈ పైశాచిక
క్రీడల మూలం,
ఊడల మర్రులై
గ్రామాల్లోనే ఉన్నాయి
పేకిలించండి
శాంతి ధాంతి
భారతదేశంకు అసలే లేవు
గుణంలేని
నాయకులు కులం ఎగదోస్తూన్నారు
మానవత్వం లేని వారు
మతం వెనకేసుకొస్తున్నారు
ఓ
భారతదేశామా ఎన్నాళ్లు ఈ
మధాందుల
దుశ్చర్యలు
ఇంకా
ఎన్నాళ్లు బాధ్యతలేని బతుకులు
ప్రశ్నలే
మిగులుతున్నాయి
ప్రతి
సమాధానం కోసం
నీ వేలును ఉపయోగించు
శాసించు
శ్వాసించు
భారతదేశాన్ని
రక్షించు.
పోల బాలగణేశ్,
పరిశోధక విద్యార్థి,
తెలుగు శాఖ,
కాశీ హిందూ విశ్వవిద్యాలయం.
వారణాసి.
06-10-2020
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి