ఏప్పుడయ్య మేము కోదవలేకుండా ఉండేది
ఏప్పుడయ్య మేము కోదవలేకుండా
ఉండేది
సరే ఆనాటి
రోజులు గుర్తు తెచ్చుకోవడం అంటే మళ్లి బాల్యంలోకి వేళ్లడమే. ప్రతిరోజు ఎలా
గడిచిపోయిందో తెలియని రోజులు. అన్ని బాగుంటే అది పేదవాని బాల్యం ఎట్లా అవుతుంది.
అట్లాంటి సంఘటన అవసరాలకు చేత్తిలో డబ్బు
ఉండని పరిస్థితి వందో రెండోందలో అప్పు ఇచ్చే వేతనజీవులున్నారు. అయితే చిత్రం
ఏమిటంటే తమ పిల్లల చేత అడిగించి ఇప్పించుకోవటం. ఆ బాలుని ఉద్వేగ పరిస్థితి అలా
డబ్బులు అడిగి తీసుకోచ్చే పిల్లవాడి మనసులోని స్థితి ఎలా ఉంటుంది ఊహించండి. ఆ కాని
మీరు అనుకునట్లు కాదు ఇంటి దగ్గర నుండి బయలుదేరి ముందు ఆ ఉద్యోగి ఇంటికి వేళ్లి
అంకుల్ నాన్న పంపాడు ఆ మీ నాన్న ఫోన్లో అడిగాడు నేను ఇస్తాలే నువ్వు పది ఆటైయానికి
స్టోరుకురా అంటు వెనకు పంపాడు. ఆ ఇచ్చే వందో రెండోందలో ఇంటి దగ్గర ఇవ్వవచ్చు కాని
అలా ఇవ్వలేదు. ఎందుకు అని ఆలోచిస్తూ దిగులుగా ముఖం పేట్టుకోని వెళ్లాడు. విషయం
ఇంట్లో చేప్పాడు సరే అనుకోని కొంత సమయం తర్వాత టైం అవుతుంది స్టోర్కు వేళ్లు అని
తల్లిదండ్రులు సూచనతో చేసేది లేక కొంత కోపం కొంత దుఃఖం, కొంత ఉత్సాహం దేవుడా
ఏప్పుడయ్య మేము డబ్బుకు కోదవలేకుండా ఉండేది అని మనసులో బాధపడుతూ వేళ్లాడు.
అంకుల్కు కనిపించి స్టోర్ లో రశీదు పై సంతకం పెట్టించుకుని ఇచ్చాడు మూడు వందల
రూపాయలు. అవి పట్టుకోని సంతోషంగా ఇంట్లో ఇవ్వడం ఆ పిల్లవాడికి ఓ అనుభూతి. విషాదం
ఏమిటంటే ఇప్పటికి అప్పుల ఊబి నుండి బయటకు
రాలేదు. వాడు చదువుకున్న ఉపాధి విద్యకాకపోవడం విచారం. మధ్యతరగతి చిరు ఉద్యోగి
కుటుంబ పరిస్థితి ఇది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి