అడివితనం నిలబేట్టిన గిరిజన మహిళ

 

అడివితనం నిలబేట్టిన గిరిజన మహిళ

       ఆధునిక నగర జీవనంలో గిరిజన అస్తిత్వం మరుగున పడిపోతున్న వైనాన్ని తెలియజేస్తుంది అడివితనం అనే కథ. ఈ కథలో గిరిజన స్త్రీ పాత్ర చేత కథనం నడిచింది. కథకుడు మల్లిపురం జగదీశ్. గురి అనే కథా సంకలనం స్నేహసాహితి వారి సౌజన్యంతో ప్రచురింపబడింది. దీనిలోనిదే ఈ కథ. వీరు ఉత్తరాంధ్ర గిరిజన సమాజం నుండి వచ్చిన కథా రచయితగా పేరోందారు. వీరు వ్రాసిన కథలు శిలకోల పేర మొదటి కథా సంకలనంగా ప్రచురింపబడింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆదివాసీ జీవితాల్లో మరుగున పడిన కోణాల నుండి మరింత లోతుగా చూస్తున్న, స్పృశిస్తున్న కథలను రచియిస్తున్న కథకుడుగా విమర్శకులు గుర్తించారు.(నేల బిడ్డల నెలవుల అన్వేషణ- రాచపాళెం చంద్రశేకర రెడ్డి-7, శిథిలమౌతున్న సామూహిక గానం- ఎ. కె. ప్రభాకర్-12, ఇవి కతలు కావు ఆదివాసీ వెతలు-అట్టాడ అప్పల్నాయుడు.-23 గురి పెడుతున్న మలి దశలో...-గంటేడ గౌరునాయుడు-25-గురి-మల్లిపురం జగదీశ్, స్నేహసాహితి ప్రచురణ-2018.) గిరిజనుల జీవన వైవిధ్యం తెలిసిన వ్యక్తిగా, వారి అనుభవాలను దగ్గర నుండి గమనించిన వ్యక్తిగా వారి కథల ద్వారా స్పష్టమైతుంది. గిరిజనులో సహజంగా ఉండే స్నేహ భావం, దయ, చుట్టు ప్రక్కల వారి బాగోగులు చూసే తత్వ్తం నానాటికి ఉద్యోగ, వ్యాపార పేర  వలస వేళ్లిన గిరిజన ప్రజల్లో క్రమంగా దూరమై, పూర్తిగా నగర జీవనాన్నికి అలువాటు పడటం గమనించవచ్చు. నగరం పైకి కనిపించిన్ననట్టుగా ఉండదు. అంతరాంతరాల్లో స్వీయ గణ లక్షణాల రక్షణ చేస్తున్నే ఉంటుంది. కాని గిరిజనులు నగరజీవుల పై మెరుగులు చూసి తమ అస్తిత్వం అయిన అడివి తల్లిని, అడవితనాన్ని మరిచిపోతున్నారు.   

       ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి వారి పూజ విధానం, దానిలో భాగంగా కళాకారుల వాయిద్య, నృత్య ప్రదర్శన, వారి పండుగలు, పంట చేలు చేతికి అందే సమయంలో చేసే సంబరాలు అన్ని ఈ కథలో ప్రస్తవించి నగర జీవనంలో ఉంటున్న, అడివితల్లి ఒడిలో నేను లేనే అని అడివిలోని తన గ్రామ నివాసానికై  తపన పడే భార్య (పేరు పేట్టబడలేదు). నగరజీవనానికి అలువాటు పడ్డ ఉద్యోగార్థం వచ్చి స్థిరపడిన ఉద్యోగి భర్త (పేరు పేట్టబడలేదు), కథలో కథనప్రధానంగా కనిపించే పాత్రలు. ఈ భార్యభర్తల జీవనం వర్ణిస్తూ అడివిలోని గ్రామ జీవనానికి నగర జీవితానికి గల తారతమ్యాని చూపింపబడింది. గిరిజన ఏజెన్సి గ్రామంలో ఉండే నాగ, అతని భార్య తార దంపతులు. అక్కడి పరిస్థితులు బాగోలేక పట్టణానికి వచ్చి చేరారు. నెల్లూరులో చేపల చెరువులో పని చేసి కూలి సరిగా అందక అటు నుంచి చెన్నై వేళ్లారు. అక్కడ తాపి పనిలో కూలి డబ్బు విషయంలో తేడ  వస్తే అది ప్రశ్నించి నందుకు గోడవ పడి వారు ఏప్పటికైన సమస్యే అని పని నుండి తీసేస్తారు. చేసేది లేక తిరుగు పయణమైనారు. రైలులో టికెట్టు లేని వారని పోలీసు గుర్తించి పట్టుకోని పోతుంటే రైలు నుండి దూకేస్తాడు నాగ. ఈ విషయాని అర్థరాత్రి వేళ తార కథలోని ప్రాధాన పాత్రైన భార్యకు ఫోన్ ద్వారా వివరిస్తుంది. అయితే భర్తకు వారి ఫోన్ సంభాషణ వల్ల నిద్రాభంగం అయి విసుగా కోపంగా ఎవరు అని అడిగితే నాగకు జరిగిన ప్రమాదం గురించి చేప్తుంది. కాని ఏమి పట్టనట్లు దుప్పటి కప్పుకొని నిద్రలోకి వేళ్తాడు. ఆమె ఏడుస్తుంటే తిరిగి లేచి ఆమెను కోపపడి నా కోసం ఏప్పుడైన ఎడ్చావా నాకంటే వాడంటేనే ..... అనేసాడు. ఇక ఆమె ఏమి సమాధానం చెప్పకుండా తనలో తాను తర్కించుకొని తారకు ఫోన్ చేసి బయపడకు నేను వస్తున్నాను అని తెలిపి బయలుదేరుతుంది. కథలో ఇది మలుపు. 

ఈ కథ ద్వారా ప్రాధానంగా తెలిసే విషయాలు.... 

1.  *  ఆధునిక కాలంలో మారిన సమాజానికి అనుగుణంగా గిరిజనులు కూడా ఉండాలని అనుకోవడం. అడివి బిడ్డలు విద్యా బుద్ధులు నేర్చి ఉద్యోగమో, వ్యాపారం కోసం నగరం వేళ్లడం. అక్కడ గిరిజనుల పట్ల సరైన ఆదరణ లేకపోవడం దానితో పాటు మోసపోవటం గమనించవచ్చు.

   ఉద్యోగస్తులు నగరంలో కలిసిపోవాడానికి వారి జీవన విధానం అలువాటు చేసుకోవడం, దానితో పాటే అణువణు అవగుణాలతోపాటు అనుమానగుణం కూడా అలువాటు చేసుకొన్నారు.

3.     ఆడంబర, కుంచితస్వాభావం, స్వార్థపారయణత- నమ్మకం, విశ్వాసం వంటి నగర, గిరిజన సంస్కృతుల మధ్య ఘర్షణ పడే ఒక విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కోంటున్న  గిరిజనులు.

4.    వారిదైన జీవనం గుణ గణాలు, ప్రేమాభిమానాలు సాంప్రదాయాలున్న వారు. వాటిని విచిపేట్టడానికి ఇష్టపడని నిజమైన అడివితనం కలవారు. అయితే అభివృద్ధి పెరిట జరిగిన విద్యా వ్యాప్తిని– ఉపాధిని నిందించటం లేదు. ఏజెన్సి గ్రామాలు నగర, పట్టణాలకు దగ్గర ఉండటం వల్ల వాటి ప్రభావంగా పెడత్రోవ పట్టి నగర జీవి తత్త్వమైన ప్రత్యక్షమందిచ్చకములాడి పరోక్షమందుఁగార్యహాని చేయు సంగాతకాఁడు పయోముఖ విషకుంభాలౌతున్నారు. (నీతి చంద్రిక-పరవస్తు చిన్నయ సూరి-క్వాలిటీ పబ్లిషర్స్ విజయవాడ-2014-పుట-25) నగర జీవుల మంచితనం కన్న వారి చెడునే స్వీకరిస్తున్నారు. వారి అస్తిత్వం క్రమంగా కోల్పోతున్నారు.

5.    నగర, పటణ వాతావరణము నేడు అన్ని ప్రాంతాలలో కొండ, కోన అనే తేడా లేకుండా          విస్తరించింది. సమాచార వ్యవస్థ మెరుగు పడింది. ఇంటర్ నెట్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీని వల్ల అక్కడి గిరిజన యువత అనైతిక త్రోవ పడుతున్నారని ఈ కథ తెలుపుతుంది.

6.     నగర ప్రాంతాలకు ఉండే సౌకర్యాలు అతిదూరంలో ఉన్న గ్రామీణ గూడెంలకు లేవు. రోడ్లు లేవు, వైద్య సౌకర్యాలు లేవు. చదువుకు రెసిడేన్సి స్కూలుకు, దగ్గర పట్టణ, నగరాలకు వేళ్లటం తప్పనిసరి అయింది. ఓటు రాజకీయాలతో ఇప్పుడిప్పుడే సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి.

7.     గిరిజన సంస్కృతి వారిదైన ప్రత్యేక అస్తిత్వం. వారి పూజలు, సంబరాలు, జాతరలు, పండుగలు, వాయిద్య విశేషాలు, నృత్యం అన్ని వారి సంస్కృతికి వారసత్వ సంపద. విలువైన ఆ సంపదను మరుగున పడకుండా రక్షించవలసిన బాధ్యత గిరిజనులపైనే ఉంది.

8.    నగర మనస్తత్వాని ఏర్పచుకోడం వల్ల తోటి మనుషుల పట్ల చూపాల్సిన కనీస దయా గుణం మరుగున పడుతుంది. ఈ అవగుణాన్ని ఈ కథలోని ప్రాధాన పాత్రైన భర్త లో గమనించవచ్చు. తన జాతికి ఏ కష్టం వచ్చిన అదుకోవడం, ఏ అవకాశం వచ్చిన అందలం ఏక్కించడానికి తపన పడే సమకాలీనంలో తన జాతివాడిని పట్టించుకోకపోవడం ఈ ప్రజాస్వామ్యంలో విద్యావంతుడైనప్పటికి వంటపట్టని వాడేనని తెలుపుతుంది. “Think Globally - Act Locally –Patrick Geddes” అనే భావన మరిచాడు.

 కథా విశ్లేషణ.... 

     నాగ అడివితనం అనే కథలో ప్రధానంగా వర్ణించిన పాత్ర. ఈ నాగ అనే వ్యక్తి కళాకారుడు. తూడుం వాయిద్యాని అద్భుతంగా మోగించేడం ఇతని కళా ప్రావీణ్యానికి నిదర్శనం. గూడెంలోని ప్రతి ఒక్క మవిషితో కలిసిమెలిసి ఉండటం, ప్రతి వారి అవసరాలలో తను ముందుండి పనులు చేయడం అతని చొరవకు, ఆదరణకు నిదర్శనం. ఏ ఉత్సవం అయిన, సంబరమైన ఈ నాగ లేనిదే మొదలు అవద్దు. అక్కడ జరిగే అమ్మ వారి ఉత్సావానికి ఈయన కుంబము ఎత్తనిదే ప్రారంభమయ్యేది కాదు. మంచితనం, నలుగురికి సహాయపడటం అనారోగ్యం అంటే డోలి కట్టి దగ్గరలోని హాస్పటలుకు తీసుకు వేళ్ళటం వారి దగ్గర ఉండి చూసుకోవటం ఆయనలోని దయా గుణానికి మంచుతునక. అతడు అక్కడి యువతకి నాయకత్వం వహించి వారిని ముందుకు నడిపించాడు.

        ఆ గుడెంలోని అందరిపట్ల స్నేహా, ఆదరణ భావంతో నలుగురుతో కలిసిమెలిసి జీవించాడు. గొప్ప కళాకారుడు, నాయకుడు. అటువంటి వాడైన నాగ తార అనే ఆమెను వివాహం చేసుకొన్ని జీవనార్థం నగరానికి వలస వచ్చారు. చేసే పనిలో తేడా ఉండదు. కాని అతడికి ఇచ్చే కూలి డబ్బులో తేడా చేప్పడంతో ఉద్రేకానికి గురిచేసింది. ఈ దోపిడిని  ప్రశ్నించడం వల్ల ఏక్కడకు వేళ్లిన ఎక్కువ రోజులు పనులో ఉంచడం లేదు. అడివితనం అంటే అన్యాయాని ప్రశ్నించడమే. పని కారణంగా జబ్బు చేసి హాస్పటల్లో చూపించే బాధ్యత  యజమానికి ఉన్నప్పటికి చూపించలేదు. దానితో అక్కడ  కూడా ఆర్థికంగా నష్టపోయి ఆ హస్పటలే ఖర్చు తనే భరించాడు. దీని ప్రశ్నించిన నందువల్ల యజమాని పనిలో నుండి తీసేశారు. టిక్కెట్ లేకుండా రైలు ఎక్కడం అక్కడి పోలిసు వారిని గుర్తించి స్టేషన్కు తీసుకొని వేళ్తుంటే ఆ సమయంలో రైలు నుండి దుకెస్తాడు దీనితో చెయ్యి విరిగిపోతుంది.

       నాగ పాత్ర ద్వారా విద్యాబుద్ధులు ఉన్నప్పటికి, కళాకారుడైనప్పటికి నగరం చేత వంచింప బడ్డాడు. నగరజీవులు గిరిజనులను శ్రమ దోపిడి చేస్తూ అది అడిగితే పన్లు నుండి తీసేస్తూన్నారు. కూలిల హాస్పటల్ ఖర్చులు వారే భరించావల్సి వున్న వారి నియమాలకు వారే నిబద్ధంగా లేకుండా శ్రమ జీవులను కష్టాలపాలు చేయడం గమనింవచ్చు. తోటి కూలిలు ఏమి చేయలేక, సహాయం చేస్తే వారిని కూలికి రానీయక పోవటం చేస్తారు యజమానులు. ఐక్యత లేక వారి బాధలో సహకారం కూడా అందించలేదు. ప్రశ్నించడం అడివితనం అయితే గిరిజనులను అన్ని విధాల దోచుకోవడం నగరతనం అవుతుందని ఈ కథ ద్వారా స్పష్టమౌతుంది. సామాజిక, ఆర్థిక కోణాలో గిరిజనం పట్ల వివక్ష చూపుతూనే, రాజ్యాంగ రిజర్వేషన్ల పట్ల ఇప్పటికి విషం కక్కుతున్నది నగర తత్త్వం. ఈ విధమైన ప్రభావాలు ఈ నాగ, తార ఏదుర్కోన్నారు. తన గ్రామంలో అందరికి ఆదరణ నిచ్చిన  నాగ నేడు ఆదరణకు నోచ్చుకోని వాడైన్నాడు. తార ఏంతో దుఃఖంతో ఉంది. వారిని ఆ బాధ నుండి రక్షించడానికి కథాలోని ప్రధాన పాత్ర భార్య గట్టిగా సంకల్పం చేసుకొని భర్తకు చెప్పకుండా వెళ్తుంది.

         ఈ నిర్ణయం తీసుకొవడానికి భార్య పాత్ర తనలో తాను చాల ఘర్షణ పడింది. దాని నుండి బయటుకు వచ్చి అడివితనం అయిన మానవత్వానికే (ఇక్కడ వర్ణం-కులం ప్రాధాన్యం లేదు సాటి మనిషి కష్టాలో ఉన్న వారి పై చూపే మానవత్వమే ప్రాధానం.) ఆమె మోగ్గుచూపింది. గిరిజన సహజ స్వభావంతో జీవిస్తూ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తూ ఉండటానికి వారి గ్రామం వదిలి పెట్టకుండా ఉండాలి అనే ధృఢ నిశ్చయంతో ఈ గిరిజన భార్య తెగువ చేసింది. నగర జీవనానికి అలువాటు పడి నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా తన తోటి గిరిజనుల పట్ల ఆదరణ భావం లేకుండా పూర్తిగా గిరిజన సంస్కృతికి దూరంగా ఉండాలనే స్వభావంతో ఉండిన భర్తకు చెప్పకుండా బయలుదేరింది. తన అస్తిత్వం, గిరిజన అస్తిత్వం నిలపడానికి గిరిజన భార్య తీసుకొన్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తుంది. నగర సౌకర్యాలకు ఆశ పడకుండా తనదైన జీవినం కోసం ముందుకు సాగింది. అదే అడివితనం. అదే మానవత్వం. మనిషి అంటే వర్ణం, కులం, మతం కాదు మనిషి అంటే సాటిమనిషిని మనిషిగా గుర్తించడమే.

       కథా రచయిత తన స్వీయ అనుభవాలుతో, గిరిజనుల జీవనం పై ప్రత్యేక దృష్టిని నిలిపి కథా రచన చేస్తూ కథా ప్రక్రియలో వారిదైన ముద్రను నిలుపుతున్నారు. గిరిజనుల వెతలు కేవలం వార్త పత్రికలో చదివే పాఠకలోకం ఈ కథలు ద్వారా సాహిత్యంలో వారి వ్యధార్థ జీవనం, సంస్కృతి, సంప్రదాయాలు, వారిదైన గిరిజన జానపద జీవితం వ్యక్తం చేస్తూన్న గిరిజన సాహిత్యాని చదువుతున్నారు. ఈ కథకుడు ఇంకా విస్తృతంగా గిరిజన సాహిత్యం సృష్టిస్తారని ఆశిస్తూన్నా.

ఉపయుక్త గ్రంథ సూచిక:

1.గురి (కథలు) మల్లిపురం జగదీశ్, స్నేహకళా సాహితి- పార్వతీపురం-

   శ్రీశ్రీ ప్రింటర్స్-విజయవాడ-30- ఏప్రిల్-2018.

2.నీతి చంద్రిక -పరవస్తు చిన్నయ సూరి- క్వాలిటీ పబ్లిషర్స్- విజయవాడ-ప్రచురణ కర్త-   

   కె.యస్.ఆర్.పతంజలి-ముద్రణ- నాగేంద్ర ఎంటర్ ప్రయిజెస్ -విజయవాడ-అక్టోబరు-2014.

3. బహుళ సాహిత్య విమర్శ సిద్ధాంతాలు-ప్రమేయాలు-పరికరాలు-సంపాదకుడు-

   ఎ. కె.ప్రభాకర్- పర్  స్పెక్టివ్స్  సామాజిక శాస్ర్తం/సాహిత్యం- హైదరాబాద్-ముద్రణ    

   హిమాలయ  గ్రాఫిక్స్ హైదరాబాద్- ఏప్రిల్- 2018.

4.సాహిత్య విమర్శ- సైద్ధాంతిక వ్యాసాలు- సంకలనం-రాచపాళెం చంద్రశేఖరరెడ్డి-ప్రజాశక్తి బుక్    

   హౌస్ -ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ప్రెస్-విజయవాడ-డిసెంబర్-2018.

********************************

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ