తల పైన దీపమే కాదు...

 

తల పైన దీపమే కాదు...

జీవాత్మను పరబ్రహ్మముకు చేర్చేదే దీపం

అంతరంగా చీకటిని తొలగించే దైవ స్మరణే దీపం

లౌకిక కల్మషాలను తొలగించేదే ఆధ్యాత్మిక దీపం

మనోవ్యాకులతకు శరీర వ్యాయమమే దీపం

కలల సాకారానికి ప్రయత్నమే దీపం

అజ్ఞాన అహంకార చీకటిలోంచి వెలుగులోకి నడిపే గురువే జ్ఞాన దీపం

త్రికరణాలను ఏకం చేసేదే కార్య దీపం

ఖగోళానికి నిత్య వెలుగు నిచ్చే సూర్యుడే దీపం

జీవికి దాహం తీర్చే నీరే దీపం

ఉచ్వాస నిశ్వాసలకు నిరంతర ఆదృశ్య వాయువే దీపం

నిత్యం జీవితానికి ఆహారం నిచ్చే పుడమి తల్లే దీపం

పంటలను పండించే రైతు శ్రమే దీపం

ఈ జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులే ప్రకృతి పురుష రూపాత్మక దీపం

స్నేహ వాత్సల్య దాన గుణమే మానవత్వ దీపం

ఇన్ని దీపాలను చేతులారా కావడమే  మానవ కర్తవ్య దీపం

కన్నులారా కాంచడమే ధర్మ స్థాపన దీప తోరణోత్సవం.

-పోల బాల గణేష్ .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ