జగన్నాథ కథచక్రాల్-సమాజ నిర్మాణ కథలు

 

జగన్నాథ కథచక్రాల్-సమాజ నిర్మాణ కథలు


      మానవ జీవితానికి అవసరమైన మార్గదర్శనం పూర్వుల నుండి, లేదా పెద్దల నుంచి అందుతుంది. ఈనాటి ఆధునిక కాలంలో వైయుక్తిక జీవితానికి అలువాటు పడిన మనిషి ఈ సమాజంలోని వివిధ పరిస్థితుల నుండి తనను తాను సంస్కరించుకోవడానికి ఏ కొద్దిగానైన ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో తెలుగు కథ తనదైన పాత్ర నిర్వహిస్తుంది. రచయితను బట్టే రూపుదిద్దుకుంటుంది కథ. సమాజ పరిశీలన ద్వారా కథలు రూపోంది, సమాజంలో  వ్యక్తి ఏ విధంగా ఉంటే వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి క్షేమమో తన కథల ద్వారా తెలియజేసిన కథకుడు జగన్నాథ శర్మ. పత్రికా రచయితగా పాత్రికేయరంగానికి, సాహిత్య లోకానికి సుపరిచితులు.

      కథా రచయిత పూర్తి పేరు అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ. విజయనగరం జిల్లా పార్వతీపురంలో 1956 ఏఫ్రెల్ 13 న జన్మించారు. కథ రచయితగా, నవలకారుడుగా, వ్యాస కర్తగా,  వివిధ గ్రంథలను రచియించిన గ్రంథకర్తగా బహుముఖ ప్రక్రియలను చేప్పటిన సుప్రసిద్ధ రచయిత. ఆంధ్రజ్యోతి ప్రచురించే నవ్య వీక్లీ సంపాదకులుగా పాత్రికేయరంగంలో వృత్తి నిర్వహిస్తున్నారు. వీరు ఇప్పటి వరకు ఐదువందల కథలు వ్రాసారని తెలుస్తుంది. వారి చిన్నతనం నుండే కథలు వ్రాయడం ప్రారంభించారు. వీరు వ్రాసిన కథలు వివిధ పత్రికలో ప్రచురించబడ్డాయి. ఆ విధంగా ప్రచురించిన రాజధాని కథలు యువ మాస పత్రికలో, (పత్రిక ప్రారంభంలో తెనాలి నుండి వెలువడేది ఆ తర్వాత హైదరాబాదు నుండి వచ్చేది.) మా ఊరి కథలు పల్లకి వార పత్రికలో, అగ్రహార కథలు ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన్నాయి. కథలతో పాటు వీరు 18 నవలలు కూడా రచన చేశారు. వాటిలో అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతాక్షేమం వంటివి పాఠకుల ఆదరణాభిమానాలు పోందాయి. వీరు సినిమా, టీ.వీ రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. కథా సరిత్సాగరం, పంచతంత్రం, పాలపిట్టి, నెమలీక, పేదరాసి పెద్దమ్మ, జగన్నాథ కథచక్రాల్-1-2 వంటివి కథా సంపుటాలు. పాఠక ప్రజల మన్ననలు పోందాయి. అలాగే వీరు అబాలగోపాలానికి అనువైన శైలిలో వెలువరించిన భారత, భాగవత, రామయణాల గ్రంథాలు సహృదయ లోకంలోనికి వేగంగా విస్తరించాయి. వీరిని 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సన్మానించింది. అలాగే బహుముఖ సాహితీవేత్త బలివాడ కాంతారావు స్మారక జీవన సాహితీ పురస్కారాని 2018 లో అందుకోన్నారు.1

     సమాజంలోని అనేక పార్శ్వాలను గుర్తించిన కథకుడు కథా వస్తువు కోసం వేరే ఏక్కడో వేతకనవసరం లేదు. వాస్తవమైన సమాజ స్థితిగతులను దర్శిస్తూ, వాటిలోని లోపాలను సరిచేసే ఆలోచన ఉంటే చాలు. ఆర్. ఎస్. సుందరం గారు ఇలా అంటారు. ఏ సాహిత్యరూపానికైనా మూలం, ముడి సరుకు సమాజమే. మానవుల జీవిత సంఘర్షణలు, సంబంధ బాంధవ్యాలు, భావోద్వేగాలు, అనుభూతులు, సుఖదుఃఖాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమస్యలు మొదలైన వాటన్నింటి సమన్వయ సమాహారమే సమాజం.2 అయితే స్వతహాగా కథకుడు పాత్రికేయరంగంలోని వారు కావడం వల్ల వ్యక్తులు-కుటుంబం- వివిధ పరిస్థితులు లేదా వివిధ సందర్భాల్లో మానవ ప్రవర్తన విధానం ఏప్పుడు ఎలా ఉంటుందో గమనించే తత్వం చేత మార్పు రావాలంటే మొదట మారాల్సింది మనిషేనని (వ్యక్తి) తెలియజేస్తారు. ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికొక చరిత్ర, ఆ చరిత్రకొక పరిణామక్రమం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రభావశీలి అయితే ఈ గమనాన్ని అతడు వేగవంతం చేస్తాడని శ్రీశ్రీ అన్నారు.2 జగన్నాథ శర్మ గారు సమాజ పరిణామాన్ని గుర్తించిన వారే కాబట్టి ఎన్నో వందల కథలను రచన చేయగలిగారు. సమాజ నిర్మాణ కథలు అని చెప్పడంలో ఉద్దేశం ఇదే. మనిషి నైతిక జీవన విధానంలోని మార్పును లేదా లోపాలను కథలోనే నిక్షిప్తం చేసి చూపేట్టడం, అటువంటి పరిస్థితులు ఏదుర్కోంటున్న పాఠకులు నిర్వహించాల్సిన కర్తవ్యం దానిలో చేప్పడం కథకుడి ప్రత్యేకత. ప్రగతిశీలి, ప్రభావశీలి అయిన కథకుడు కాబట్టే ఈ పేజీ కథలు ప్రాచుర్యం పోందాయి. వారు వ్రాసిన ఈ నవ్యవీక్లీ మొదటి పేజీ కథలు జగన్నాథ కథచక్రాల్ (మొదటిది) లో సంపుటికరించిన కథలన్ని సమాజ నిర్మాణ కథలే అంటే అతిశయోక్తి కాదు. ఈ కథ సంపుటిలో మొత్తం వంద చిన్న కథలున్నాయి. అన్ని దాదాపు ఒక పేజీ నిడివిలోనివే. ప్రతీది ప్రత్యేకమైన మానవ కేంద్రమైన అంశాన్ని తీసుకోని రాసినవే. ఈ సమాజంలోనివే. విలువలు కోల్పోతున్న ప్రస్తుత సమాజంలో  ఎట్లా ఉండాలో కూడా సూచనలు నిర్దేశిస్తూ భావి ఆరోగ్యకరమైన సమాజం కోసం అందించ్చినవిగా ఈ కథలున్నాయి. ఓ రెండు మూడు కథలు ఉదహరించి స్వస్తి పలుకుతాను.

      సర్వసాధరణంగా ఎక్కడికి వెళ్లిన హోటలల్ ఉండటం మనం చూస్తూనే ఉంటాము. ఆ ప్రాంతంలోని ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉన్న టిఫిన్ హోటల్ ఉండటం సహజం. కాని ఆ హోటల్ వారి చిన్న సదుద్దేశం ఎంతటి విలువను నేర్పిస్తూందో... అటువంటి కథే దేవుడిడ్లి. ఈ కథలో ఓ ఊరికి పెడ్లి కొడుకు స్నేహితులు వివాహా కార్యక్రమానికి హజరై అక్కడి ప్రముఖ హోటల్లో టిఫిన్ చెద్దామని అడిగి తెలుసుకొని చలమయ్య హోటల్కు చెరుకున్నారు. కేవలం ఇడ్లీ మాత్రమే అందించబడుతుంది ఆ హోటల్లో. ఫ్రెండ్స్ వెళ్లి కూర్చున్నారు. చాల చిన్నది హోటల్. అక్కడికి కస్టమర్లు టిఫిన్ కోసం వచ్చి మూడు పేట్లు టిఫిన్ ఆర్డర్ ఇచ్చి ఒక ప్లేట్ దేవుడిడ్లీ ఆర్డర్ చేస్తూన్నారు. దేవుడు అనే వ్యక్తి ఎవరు కనిపించకపోవడం స్నేహితులు గమనిస్తూన్నే ఉన్నారు. సర్వర్  వచ్చి ఇచ్చిపోవడం బిల్లు మూడు పేట్లుకు ఇవ్వడం, డబ్బు కట్టి ఒక స్లిప్ దేవుడిడ్లీ అంటూ గోడకు స్లిప్ అంటిస్తూన్నాడు చలమయ్య. వారికి ఏమి అర్థం కాలేదు. వారు టిఫిన్ చేసి పెడ్లి కొడుకు పిలుస్తూన్నాడని వెళ్లిపోయారు.

           మర్నాడు ఉదయం కూడా టిఫిన్ చేయాడానికి చలమయ్య హాటల్కు వేళ్లారు. అక్కడ చాల అసహ్యంగా ఉన్న బిచ్చగాడు వచ్చి ఇడ్లీ తింటున్నాడు. చెట్ని, సాంబార్ కావలసినంత అడిగి వడ్డించుకోని తిని వేళ్ళాడు. సర్వర్ దేవుడిడ్లీ ఒకటి అని అరచి చేపితే అక్కడ అంటించిన స్లిప్ ఒకటి చీంచిపారేశాడు ఓనరు. అక్కడ అది చూసిన ఆ స్నేహితులు విస్తూపోతారు. ఏ హోటలోకైన బిచ్చగాడిని రానిస్తారా, రానించ్చిన సిటులో కూర్చోపేటి టిఫిన్ ఆర్డర్ ఇచ్చి కావలసినంత సౌకర్యవంతగా టిఫిన్ పేట్టి, పైసా కూడా తీసుకోకుండా వేళ్ళనీస్తారా కాని వెళ్ళాడు.  చలమయ్య గారి ఔదార్యం, ఆ ఊరి ప్రజల దాతృత్వమే దీనికి కారణం. ఆకలికి అలమటించే వారికి ఆహారం అందించడం కోసం చలమయ్య గారి ఆలోచన, దానికి తోడు ఆ ప్రజల్లో ధర్మం చేయాలనే ఆచరణాత్మక నడవడి ఎంతో గోప్పది. ఇది  చూసిన స్నేహితులు చలమయ్యను అభినందిస్తే మీరు చేయాల్సింది నన్ను అభినందించడం కాదు మీ ఊరిలో ఇలాంటి వెసులుబాటు కల్పించమన్నారు. ఇంకా పేదలకి ఇంత తిండి పెట్టండి ఆనందిస్తాను అన్నారు చలమయ్య. ధర్మం చెయ్యడానికి కూడా టైం చిక్కని ఈ వేగవంతమయిన జీవితంలో ధర్మానికి ఓ చక్కటి అవకాశాన్ని కల్పించింది చలమయ్య హోటల్. ధర్మం చేసేందుకు అక్కడికో ఇక్కడికో వెళ్ళక్కర్లేదు. బిచ్చగాళ్ళను వెదుక్కోనక్కర్లేదు. డబ్బిచ్చి తృప్తి పరచలేం. అదే ప్లేట్ ఇడ్లీ పేట్టి తృప్తి పరచవచ్చు. అతని ఆకలిని కాస్తలో కాస్తంత తీర్చోచ్చు.3

       కుటుంబంలో భర్తకు ఇష్టం లేని గర్భధారణ ఎంతటి దుఃఖానికి కారణమైయిందో, ఆగర్భంలోని చిట్టితల్లి  ఉత్తరం ద్వారా కథకుడు తెలియజేశాడు. గర్భనివారణకు భార్య భర్తల మధ్య జరిగే సంఘర్షణ, దాని కారణంగా మహిళ అనుభవించే బాధను ఈ కథలో వర్ణన చేశారు కథకుడు. అయితే గర్భంలోని శిశువు ఆడశిశువు కాబట్టి ఆ చిట్టితల్లే స్వర్గంలో నుంచి  అమ్మా అంటూ ఉత్తరం వ్రాసింది. సాదారణంగా గర్భస్థ శిశువు రూపుదాల్చక ముందే గర్భస్రావం చేయడం జరుగుతుంది. కాని ఈ శిశువు అవయవ నిర్మాణం రూపుదిద్దుకోంటున్న సమయంలో చిట్టితల్లిని గర్భస్రావం చేయడం జరిగింది. ఆ బాధ ఇటు చిట్టితల్లికి అటు తల్లికి శారీరక, మానసికంగా కలిగింది. గర్భంలోనున్న తన స్థితిని, తల్లి పట్ల గల ప్రేమను ఈ ఉత్తరం ద్వారా వ్యక్తపరిచింది. అయితే ఆ రాచ్చసి గురించి దేవుడి ద్వారా అబార్షన్ అని తెలుసుకుంది. చివరికి అయిందేదో అయిపోయింది. చచ్చిపోయాను, అయినా నీకెందుకీ ఉత్తరం అంటే,నువ్వంటే నాకు చాల ఇష్టం అమ్మా. ఎప్పటికయినా నీ  కూతురుగా పుట్టాలని ఉంది. అందుకు రాస్తున్నాను. జాగ్రత్తమ్మా! పదే పదే అబార్షన్ రాచ్చసి నీ కడుపులోకొస్తే నువ్వు తట్టుకోలేవు. చచ్చిపోతావు. రాకుండా చూసుకో! నాన్నకి కూడా చెప్పు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని!” 3 అని ఉత్తరంలో చిట్టితల్లి చెప్పింది. పూర్తిగా రూపమే లేని శిశువు తన తల్లి భావాలే తన బాధగా పోందింది. ఏడ్చింది. ఆపరేషన్ దియేటర్లో తనపై జరిగిన దాడిని రాచ్చసి దాడిగా భావించింది.

       నేటి వాస్తవ పరిస్థితులు తలపిస్తూ ఆడ శిశువని తెలిసి జరుగుతున్న అబార్షన్ల గురించి స్పష్టపరుస్తుందీ కథ. ఈ సమాజంలోని పాఠకులకు పదే పదే అబార్షన్ల వల్ల చివరికి తల్లి ప్రాణాలకే ముప్పు వస్తుందని, అబార్షన్కు ఎక్కువగా పాల్పడవద్దు అని తెలియజేస్తుందీ కథ. దీనిలో ఆర్థిక, సామజిక కోణాలు అంతర్గతంగా ప్రభావితం చేస్తున్నాయని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

         డైరిలో ఒక పేజీ అనే కథలో పట్నంలో నివాసముంటున్న కొడుకు. అతడి తల్లి మరణించినా, తండ్రి మాత్రం ఇంకా పల్లెటురులోనే ఒంటరిగా ఉంటున్నాడు. తన తండ్రికి ఆనారోగ్యం చేస్తే చుట్టు ప్రక్కల వారు జాగ్రత్తగా చూసుకోన్నారు. ఇది తెలిసిన కొడుకు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తండ్రిని తన వెంట పట్నానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ తండ్రి పరిస్థితిని క్షుణంగా గమనిస్తూ కొడుకు తండ్రి ఇబ్బందిని గమనించాడు. రాత్రి సమయంలో నాన్నను చూడానికి వచ్చిన కొడుకు అతను నిద్ర పోవడంతో తిరిగి వెళ్ళబోయాడు అంతలో అతనికి తండ్రి దిండు క్రింద ఒక డైరి కనిపించింది. దానిలో తండ్రి ఏవిధంగా అలసిపోయింది, తన జీవన సరళీ ఏవిధంగా వుంది, తనను ఏవిధంగా చూసుకుంటే తను ఆ పట్నంలోని జీవన సరళీ గల వ్యక్తిగా అవుతాడో చెప్పుతాడు. నాన్నగా తన ఇష్టాయిష్టాలు అందులో చెప్పి తాను చిన్నప్పుడు కొడుకును ఏవిధంగా చూసుకోన్నాడో ఆ విధంగా పోలుస్తూ చెప్పడం జరిగింది. తండ్రిగా ఏవిధంగా కుమారుని పై ప్రేమ చూపాడో అదే విధంగా తనంత ప్రేమగా చూసుకోవాలని తెలిపాడు. ముసలి కంపు కొడుతున్నానని, అసహ్యంగా ఉన్నానని దూరంగా పారిపోకు, దగ్గరగా తీసుకుని కూర్చో నీ చిన్నపుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునే వాణ్ణి. నువ్వలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతాను చంపాలని మాత్రం ప్రయత్నించకు. - డైరీ మూసేశాడతను. కళ్ళు చెమర్చుకుని, తండ్రిని చూశాడు. చలికి వణికిపోతూ కనిపించాడు. దుప్పటి కప్పాడు. కప్పి, పండిన తండ్రి తలను ఆప్యాయంగా నిమిరాడు. నుదుటన ముద్దుపెట్టి మురిసిపోయాడు.3

      కోడుకులు నేడు ఆస్తుల కోసం తల్లిదండ్రులను నరకయాతనపాలు చేస్తూన్నా ఈ తరుణంలో తల్లిదండ్రులను బిడ్డలు ఏవిధంగా చూసుకోవాలో ఈ కథ ద్వారా తెలియజేశారు కథకులు.

        భగవద్గీత అనే కథలో శెలవులకు ఇంటికి వచ్చిన మనువడు తాతను రోజు గమనిస్తూ ఉంటాడు. తాత రోజు భగవద్గీత గ్రంథాని చదవడం చూసి ఆ బాలుడు తను కూడా తాత మాదిరి శుభ్రంగా స్నానపానాదులు ఆచరించి భగవద్గీతను చదవడం ఆరంభించాడు. కోన్ని రోజులు ఈ విధంగా చేసిన ఆ బాలునికి దానిలోని విషయం అర్థం కాక నేరుగా తన తాత వద్దకు వేళ్లి అడిగాడు తాత రోజు ఈ భగవద్గీత పారాయణం వల్ల ఏమిటి ప్రయోజనం అని. అప్పుడు తాత సమాధానం  కార్యకారణ రూపంగా బోధించాడు.

      తన కళ్ళేదుట ఉన్న బోగ్గుల గంపను చూసి నీవు వేళ్లి ఈ బుట్టతో ఆ యేటి నుండి నీరు తీసుకునిరా అని చెప్పుతాడు. మనువడు నీరు తీసుకొని రావడానికి పలుమార్లు ప్రయత్నించి తాతతో ఈ బుట్టకు రంధ్రాలున్నాయి దీనితో నీరు ఏలా తెవడం, నీరు దీనిలో ఏలా నిలుస్తూంది అని ప్రశ్నిస్తాడు. అయిన లేదు దీనితో నీరు తీసుకోని రావలసిందే అంటారు. ఆ బాలుడు ఇంకా వేగంగా నీరు ముంచి తీసుకోని రావడానికి ప్రయత్నిస్తాడు చివరకి తాత దగ్గరకు వచ్చి తాత బుట్టతో నీరు తీలుకురావడం సాధ్యం కాదు అని చెప్పుతాడు. అసలు దీని వల్ల ప్రయోజనం లేదు అంటాడు. అప్పుడు తాత చూడు ఈ బుట్ట నువ్వు తీలుకోని వేళ్లేటప్పుడు బోగ్గులతో నల్లగా ఉంది. ఇప్పుడు చూడు ఎంత స్వచ్ఛంగా తెల్లగా మారిపోయిందో అని చూపించి మనువడుకి చేప్తూ భగవద్గీత చదవడం వల్ల కూడా ఇదే ప్రయోజనం కలుగుతుంది. మనిషిలోని కల్మష్మాలన్ని క్రమంగా భగవద్గీత చదవడం ద్వార వేళ్లిపోతాయి. రోజు రోజుకు కొంత మార్పు మనిషిలో తప్పక కలుగుతుంది అని సమాధానం చేబుతాడు.

         భగవద్గీత చదవడం వల్ల లాభం ఏమిటని అడిగావు చూడు ఇదే లాభం. చదివిందంతా గుర్తుండకపోవచ్చు. అర్థం కాకపోవచ్చు. కాకపోతే చదివిన ప్రతిసారీ ఎంతో కొంత నీలో మార్పు కలుగుతుంది. నీ మనసు, శరీరం రెండు స్వచ్ఛత సంతరించుకుని, శుభ్రపడతాయి. చాలు కదా. అన్నాడు తాతయ్య. చాలు అనుకున్నాడు మనవడు.3

        ఇలాంటి కథలు సమాజాభివృద్ధికి దోహదంకరంగా ఉంటాయి. పరస్పర ఆశ్రితాలైన సమాజ సాహిత్యాలను దేని నుండి ఏది ప్రయోజనం పోందుతుందో.. కాని ఓ సందర్భంలో గోర్కీతో టాల్ స్టాయి ఇలా అన్నాడట నిజజీవితాని యథాతథంగా రాయకు. జీవితం పై నీ అభిప్రాయాలతో, జీవితం ఎలా ఉండాలని వాంచిస్తున్నావో వాటిని చిత్రీకరించు.4 ఆ విధంగా సమాజ శ్రేయస్సును, హితాన్ని కోరకు, సమాజంలోని వ్యక్తుల ఆలోచనలు, ఆచరణలు అటు కుటుంబానికి, ఇటు సమజానికి మేలైనవిగా ఉండాలనేదే ఈ కథకుని ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇవి సమాజ నిర్మాణ కథలుగా అర్థం చేసుకోవడంమే సాహిత్య ప్రయోజనం. ఈ ఒక పేజీ కథల నుండి నేర్చుకోవడానికి పాఠకునికి అనేక విషయాలున్నాయి. సాహిత్యం సమాజ విలువలనూ, వాటి స్వరూపాన్ని విమర్శనాత్మకంగా వెలువరించడం ద్వారా పాఠకుడు జీవితాన్ని నిర్థిష్టంగా అర్థం చేసుకోగలుగుతాడని విమర్శకులు పేర్కోంటారు. జగన్నాథ కథచక్రాల్ (1-2) నూరు నవ్యవీక్లీ మొదటి పేజీ కథలు సంపుటిని మరింత లోతుగా సహృదయ పరిశోధకులు పరిశీలించగలరు.

సంఖ్యా సూచికలు

1.  1.  te.wikipedia.org/wiki/ఎ.ఎస్.జగన్నాథ శర్మ

2.  2.   https://eemaata.com/em/issues/201801/14729.html.

3. 3.    దేవుడిడ్లీ-పుట-10, చిట్టితల్లి-పుట-12, డైరిలో ఒక పేజీ-పుట-16, భగవద్గీత-పుట-208-   జగన్నాథ కథచక్రాల్ -నూరు నవ్యవీక్లీ మొదటి పేజీ కథలు సంపుటి- జగన్నాథ శర్మ.అమరావతి పబ్లికేషన్స్- గుంటూరు- 2013.

4.   4. https://eemaata.com/em/issues/201801/14729.html.

పరిశోధక విద్యార్థి,తెలుగు విభాగం,కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి-221005.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ