పోస్ట్‌లు

చిత్రం
  శుభకృత్  శుభకృత్ శోభను చేకురుస్తూ ముందుకు వచ్చింది మామిడి చిగురు తొడిగినట్టు  నూతన ఆశలను ఆశయాలను  కాలం సంచిలో వేసుకొని వచ్చింది శుభకృత్ ఉగాదిలో నూతన జీవితాానికి  షడ్రుచుల ఆస్వాధనను తెనుంనది. పైశాచిక మతవాదులు నలుదిక్కుల వ్యాపిస్తున్న... మధ్యతరగతి ఆర్థిక నడుము విరుగుతున్న నిరుద్యోగులు ఉద్యోగమో రామచంద్రా  అంటున్నా వేళ శుభకృత్ శుభాని చేకురుస్తూ.... ఆకలికి అలమటించి గూడులేక దారి తెన్నులేక నలిగిపోతున్న వేళ ఈ శుభకృత్ వత్సరం పేదలకు చేయందిస్తూ.... సకల కల్మషాలతో  కుటీలాలోచనలతో పైకి అమృతతపు చిరునవ్వును చిందింస్తూ.... అంతరంగంలో హాలాహలం పెంపోదింస్తూ.... పైకి దివెనలు కురుపిస్తూ లోన అధః పాతాళానికాంక్షిస్తూ.... మనుషుల మధ్య నున్న వేళ విశ్వాసానికి కపటానికి తేడా ఎరుగని  సంకుచిత చిత్తుల నడుమ .... శుభకృత్ శుభాని.... యూద్ధం శాంతి అంటూ ప్రపంచం చిందరవందరగా ఉన్న ఈ వేళ శుభకృత్ వస్తుంది.  మేధావులంతా కమలనాథులకు తాళాలు మోగిస్తూ... ఆశ్రీతులకు అద్దలం ఎక్కించడానికి విశ్వయత్నాలు చేస్తూ...వేళ రాజ్యాంగం విస్మరించి సౌభ్రాతృత్వం అంటుంచి  సామ్యవాదం మరిచి ప్రైవేట్  పథం ...

నీతి శతకాలు – మానవ జీవితాలకు ఆదర్శప్రాయాలు

చిత్రం
  నీతి శతకాలు – మానవ జీవితాలకు ఆదర్శప్రాయాలు పోల బాలగణేశ్, పరిశోధక విద్యార్థి, తెలుగు విభాగం, కాశీ హిందూ విశ్వవిద్యాలయం,  వారణాసి-221005.       నైతిక జీవితానికి వన్నె చేకుర్చేవి నీతి శతకాలు. సంస్కృత కావ్య శాస్త్రం పేర్కొన్న ముక్తక ప్రక్రియ భారతీయ భాషలతో పాటు   తెలుగు సాహిత్యంలో శతక రచనగా చెప్పవచ్చు. సంస్కృత సాహిత్యంలోను   శతక రచనలు ఉన్నా, అవి తెలుగు సాహిత్యంలోని శతకాలు కన్న తక్కువ ఉన్నాయని పరిశీలకులు తెలిపారు. శతకం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పద్యాల సంఖ్య అది 108 లేదా 116. ఈ నూట ఎనిమిది పద్యాలు దైవ స్ర్తోత్రాల్లో, అష్టోత్తర శతనామాలు వంటి ఆధ్యాత్మిక స్ర్తోత్రాల ప్రభావంగా ఈ శతక పద్య సంఖ్య స్థిరపడింది. కొన్ని 105, కొన్ని 100 కన్న తక్కువ ఉంటే, మరి కొన్ని వందకు పైగా ద్విశతి, త్రిశతి, పంచవింశతి వంటివి కూడా ఉన్నాయి. 12వ శతాబ్దం నుండి శతక సాహిత్యం ప్రారంభమైనది. అది కూడా   వృషాధిప శతకంతో ఆరంభమైది. నిర్థిష్ట శతక నియమాలు, లక్షణాలైన   పద్య సంఖ్య,   మకుటం, ఏక రసాత్మకం, ఏక ఛందస్సు వంటివి. అయితే కొంత మంది సాహిత్య చరిత్రకారులు శత...

ఎంతకాలమైంది ......

చిత్రం
ఎంతకాలమైంది ...... భావ శూన్యమైన వేళ  ఆలోచనలు తొలచిన వేళ పలుకుల పొందిక లేక సందడి చేసే ఉత్సాహం లేక కాలం ద్రోలించటం పైనే దృష్టి నిలిపిన వేళ  ఎక్కడి నుండి వస్తుందీ కవితావేశం. భరోసా లేని బ్రతుకులు చస్తూ బ్రతుకుతూ కాలం వెళ్లదీస్తున్న  దేశం. భోగ భాగ్యాలతో తులతూగే నా దేశం నేడు  పరాయి దేశాల ఆపన్న హస్తం వైపు చూపులు. అహంకారం తలకెక్కితే ఏమవుతుందో చూపిన కరోనా స్థితిమంతులమే అయిన భయాందోళనల నడుమ పయనం మా మనుగడ కోసం. రెక్కాడితేగాని డొక్కాడలేని శ్రమజీవుల పాలిట ఏ దేవుడు కరుణించేను. గూడు లేని బ్రతుకును, రోడ్డునే నమ్ముకున్న దీనులను ఉద్ధరించే వారేరి ? కరోనా అంటు వ్యాధి బారిన పడిన ఈ వేళ విధించిన నిర్భంధ వేళ   మధ్య తరగతికి రోజు గడిచేది ఎలాగో ? మహమ్మారి  ఉపశమనానికి నిధుల వర జల్లులు కురిసిన  భూమి పుత్రులకు చేరిందా...? స్వీయా నాయకోదరపోషణార్థం కాక ప్రతి పేదవారికి చేరితే అదే మాధవ సేవా. మధ్య తరగతి కష్ట నష్టాలను  జీవన వేదనలను గమనించినా చాలు అదే పదివేలు. ఆసుపత్రిలో బేడ్ లేక ఆక్సిజన్ లభించక, ప్రతి గ్రామం, పట్టణం, నగరం అనే భేదం లేకుండా మరణ మృదంగం ధ్వనిస్తూంటే... ప్రాణాలు పోయిన...