అడివితనం నిలబేట్టిన గిరిజన మహిళ
అడివితనం నిలబేట్టిన గిరిజన మహిళ ఆధునిక నగర జీవనంలో గిరిజన అస్తిత్వం మరుగున పడిపోతున్న వైనాన్ని తెలియజేస్తుంది ‘ అడివితనం ’ అనే కథ. ఈ కథలో గిరిజన స్త్రీ పాత్ర చేత కథనం నడిచింది. కథకుడు మల్లిపురం జగదీశ్. ‘ గురి ’ అనే కథా సంకలనం ‘ స్నేహసాహితి ’ వారి సౌజన్యంతో ప్రచురింపబడింది. దీనిలోనిదే ఈ కథ. వీరు ఉత్తరాంధ్ర గిరిజన సమాజం నుండి వచ్చిన కథా రచయితగా పేరోందారు. వీరు వ్రాసిన కథలు ‘ శిలకోల ’ పేర మొదటి కథా సంకలనంగా ప్రచురింపబడింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆదివాసీ జీవితాల్లో మరుగున పడిన కోణాల నుండి మరింత లోతుగా చూస్తున్న, స్పృశిస్తున్న కథలను రచియిస్తున్న కథకుడుగా విమర్శకులు గుర్తించారు.(నేల బిడ్డల నెలవుల అన్వేషణ- రాచపాళెం చంద్రశేకర రెడ్డి-7, శిథిలమౌతున్న సామూహిక గానం- ఎ. కె. ప్రభాకర్-12, ఇవి కతలు కావు ఆదివాసీ వెతలు-అట్టాడ అప్పల్నాయుడు.-23 గురి పెడుతున్న మలి దశలో...-గంటేడ గౌరునాయుడు-25-గురి-మల్లిపురం జగదీశ్ , స్నేహసాహితి ప్రచురణ-2018.) గిరిజనుల జీవన వైవిధ్యం తెలిసిన వ్యక్తిగా, వారి అనుభవాలను దగ్గర నుండి గమనించిన వ్యక్తిగా వారి కథల ద్వారా స్పష్టమైతుంది. గిరిజనులో సహజంగా ఉండే స్నేహ భావం,