పోస్ట్‌లు

నవంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

మోదీయం(డ్) కమనీయం రమనీయం

చిత్రం
 మోదీయం(డ్) కమనీయం రమనీయం  ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని అదే ఖగోళాంతానికి నాంది. ఓటరు వెంట తిరిగే వారు వెన్నుపోటుదారులని తెలిసిన.... చుట్టున్న వాళ్ళు గుంటనక్కలని తెలిసిన... కన్నవాళ్ళు జాగ్రత్త చెప్పిన... భుజకీర్తిలు వెంట నడిచే వారి కీర్తిదాహం అనంతకోటంత ఆరాటం.... అయిన... పోల్ అయ్యాయి. ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని అదే ఖగోళాంతానికి నాంది. నేతి నేతి నీతై కూట నీతి కూటి నీతి లేనివాని కడుపు కొడుతున్న.... తెలియని వానికో విధానం... రహస్యం తెలిసిన వానికో పద్ధతి... ఇదే ఘన భారతావని ఘన కీర్తి మానవ జన్మే ఎందుకనేలా జీవనగమనం.... ప్రకృతిలోంచి ప్రభవించిన అగ్ని అదే ఖగోళాంతానికి నాంది.  జీవ మనుగడే జలం విజృంభణమే విశ్వ విధ్వంసం అనంత సృష్టిలో ప్రకృతి ఆవిర్భావ వినాశనాలేంత సహజమో పతనం అంతం అంతే సహజం వ్యవస్థలన్ని విషాలు చిమ్మే సహస్ర తలల ఫనులయ్యాయి గోవు హస్తాల తోడ్పటుతో పడగ పడగన ఎదిగిన వికృత నాథులున్నారు వెయ్యి కన్నుల   ఈర్ష్యాసూయపుటాలోచనల వక్రదృష్టులు చక్రవ్యూహాచతురులు కమల చరణులు శరణు శరణు వేడు కైమోడుపుల అహంకార భావా లోచన మూర్తులు శవాకారాల ఆహాకారాలు

అక్టోబర్ మాసం

చిత్రం
అక్టోబర్ మాసం వరుణుని అవిచ్ఛన జల్లుల సవ్వడిలో వాగులై వంకలై ప్రవహించిన నదినదాలు పచ్చదనంతో పుష్పించిన ప్రకృతి పచ్చని చీర సింగారం కొండ శిఖరం నుంచి వీక్షిస్తున్న అనుభూతి పారవశ్యం   సునిశిత హృదయంలో సౌందర్యానంద హరివిల్లు వెల్లివిరుస్తుంది. వర్ష రుతువు నుండి చలి కాలం వైపు నడిపే మాసం అక్టోబర్ నులివెచ్చని చెలి కౌగిలిలా మనోహరంగా సాగే పచ్చకర్పూరపు పారజాత పుష్పాల సుగంధ పరిమళ గాలులు   తీగలు తీగలుగా సాగుతూ తనువును పులకింప చేస్తుంది.  మనసును రంజిప చేస్తుంది. తెల్ల తెల్లని తెలవారు జామున సాయం సంధ్యా సమయంలో చల్లని గాలుల స్పర్శ వింత సోయగాల రాత్రి పగళ్ళు వేడివేడి టీలు చాట్ మసాలాలు డీఫ్రై చేసిన మముస్సూపులు చెలి వెనుక కుర్చున్న   బైకు రైడింగు ఓ నూతన ఆహ్లాద వాతావరణం అలుముకుంటుంది.   మధుబన్ తోటలో గువ్వల జంటల కోలహలం మయురాల స్వేచ్ఛ విహారాలు గంగా తీర ఘాట్టులో చక్కర్లు కొడుతూ   చెలి నడుమున చేయి వేసి నడుస్తూ,   కబురు చేప్తూ చలికాలంకు స్వాగతం పలుకుతూ అక్టోబర్ మాసం మనో పుష్పాలు వెల్లువిరుస్తాయి రజనీగంద సువాసనలు చుట్టుముడతాయి. చిత్రమైన జ్ఞాన దాహంకు ద