నగరంలో వాన - కుందుర్తి ఆంజనేయులు
నగరంలో వాన కుందుర్తి ఆంజనేయులు నగరంలో వాన కవిత్వం నా ఊహాంచలాల్లో కదిలాడుతున్నట్లు జల్లులు జల్లులై కురుస్తుంది ఆశుకవితలో నగర ప్రజలకు ఆశీస్సులు పలుకుతున్నట్లు అనంత ధారా సమేతంగా అంబరం మెరుస్తుంది నగరంలో వాన అంబరానికి అంతసంబర మెందుకంటే.. నున్నగా తెల్లగా తళతళలాడే సిమెంట్ రోడ్ల అద్దాలలోకి మింటి నుండి మెడలువంచి చూసి తమ అందం చినుకుల కుప్పలుగా పోసి అంతులేని ఆకాశమంత ఆనందంతో మెలికలు తిరుగుతూ మిలా మిలా మెరుస్తాయి మేఘాలు పక్షాలు పోయినా పాదాలు వచ్చి పర్వతాలు పారాడుతున్నట్టు పరుగెత్తే రెండంతస్తుల బస్సుల్ని చూసి గిరి శిఖర భ్రాంతితో క్రిందికి దిగి వచ్చిన మేఘాలు పైకి వెళ్ళడానికి బద్దకం వేసి కాబోలు బహుకాల నగర దర్శన భాగ్య ప్రాప్తి చే కాబోలు ఆ రాత్రికి సినిమా చూసి ఉదయమే వెళ్ళొచ్చని కాబోలు అక్కడే నిలబడిపోతాయి హర్షం వర్షంగా కురిపిస్తూ నడిబజారులో పడిపోయిన మూర్చవాడు బిందెలతో దాహం తాగినట్లు పగుళ్ళువారి నోరు తెరచుకున్న భూదేవికి పల్లెల్లో పది దిక్కులైనా లెక్కుండదు పల్లె సీమలో వానలమేనాల మీద