వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ
వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ డాక్టర్. పోలా బాలగణేశ్ టి.జి.టి. తెలుగు ఉపాధ్యాయులు, గేస్ట్ ఫ్యాకల్టి, ఏకలవ్య ఆదర్శ ఆవాశ పాఠశాల, బుట్టాయిగూడెం, ఏలూరు జిల్లా-532502 ఉపోద్ఘాతం భారతీయ ఇతిహాసంలో రైతుల ప్రస్థానం గమనించినట్లైతే మొదట చాతువర్ణ వ్యవస్థలో వైశ్యులు వ్యవసాయం చేయడం గమనిస్తాము. తర్వాత కాలప్రవాహంలో ఈ వ్యవసాయం శూద్రులకు సంక్రమించింది. నేడు వ్యవసాయం చేయని, రాని వర్గం లేదు. నాగరికతకు పునాది వేసింది వ్యవసాయం అంటే అతిశయోక్తి కాదు. అటువంటి రైతు పరిస్థితి నేటికి అస్థవ్యస్థంగా ఉంది. రైతుల పట్ల నిరాధరణ పరిస్థితులు పెరుగిపోతున్నాయి. అందులో ఓటుబ్యాంకు రాజకీయాలు కారణంగా పార్టీ రైతులు తప్ప పూర్తి రైతాంగం ప్రభుత్వ సదుపాయాలు పొందడం లేదు. “ వ్యవసాయం సాటిలేని సృజనాత్మక కళ. ప్రపంచంలో సజీవ సృష్టి చేసే కళ అదొక్కటే చరిత్రలో మొట మొదటి మౌళిక కళాకారుడు రైతే. చరిత్రలో సాటిలేని వంచన పాలయ్యింది కూడా రైతే ” అని పాపినేని శివశంకర్ గారు ‘ రైతు కవితా వికాసం ’ అనే వ్యాసంలో పేర్కోన్నారు. ఈ మాటలు అక్షరసత్యాలు. నేటికీ రైతు వంచనకు గురౌతున్నాడు. మన దేశంలో