పోస్ట్‌లు

అక్టోబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

చిత్రం
  గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం డాక్టర్. పోల బాల గణేష్ ,   ఈ.ఎం.ఆర్. మోడల్ స్కూల్ ,   బుట్టాయిగూడెం ,   ఏలూరు జిల్లా   ఆంధ్ర ప్రదేశ్ -5344465 9704555450.              భూమిపై మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు సాటి మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలి. తనలాగా తోటి మనిషి కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నాడని అతని పట్లకనీసంగా మానవత్వం కలిగి వ్యవహరించాలనే దృక్పథం గురజాడ కవిత్వంలో కనిపిస్తుంది.   భారతీయ సమాజం వర్ణాలుగా విభజింపబడి , ఆయా వర్ణాలు తమదైన వృత్తిని జీవన విధానాలు కలిగి సమాజంలో జీవిస్తుంటారు.   కానీ మన భారతీయులు వర్ణాశ్రమ ధర్మాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి కనీసం మానవులుగా కూడా వ్యవహరించకుండా, ఈ సమాజంలో అట్టడుగు వర్గాన్ని సృష్టించి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించే అనేక నియమాలను   ఏర్పరచుకొని జీవించడం జరిగింది.   “ మలిన వృత్తులు మాలవారని కులము వేర్చిన బలియు రొక దే శమున కొందరి వెలికి దోసిరి మలినమే, మాల కులము లేదట వొక్క వేటున పసరముల హింసించు వారికి కులము కలదట నరుల వ్రేచెడి క్రూర కర్ములకున్. మలిన దేహుల మాల లనుచును, మలిన చిత్తుల కధిక కులముల నెల వొసంగిన వ