నీతి శతకాలు – మానవ జీవితాలకు ఆదర్శప్రాయాలు
నీతి శతకాలు – మానవ జీవితాలకు ఆదర్శప్రాయాలు పోల బాలగణేశ్, పరిశోధక విద్యార్థి, తెలుగు విభాగం, కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి-221005. నైతిక జీవితానికి వన్నె చేకుర్చేవి నీతి శతకాలు. సంస్కృత కావ్య శాస్త్రం పేర్కొన్న ముక్తక ప్రక్రియ భారతీయ భాషలతో పాటు తెలుగు సాహిత్యంలో శతక రచనగా చెప్పవచ్చు. సంస్కృత సాహిత్యంలోను శతక రచనలు ఉన్నా, అవి తెలుగు సాహిత్యంలోని శతకాలు కన్న తక్కువ ఉన్నాయని పరిశీలకులు తెలిపారు. శతకం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పద్యాల సంఖ్య అది 108 లేదా 116. ఈ నూట ఎనిమిది పద్యాలు దైవ స్ర్తోత్రాల్లో, అష్టోత్తర శతనామాలు వంటి ఆధ్యాత్మిక స్ర్తోత్రాల ప్రభావంగా ఈ శతక పద్య సంఖ్య స్థిరపడింది. కొన్ని 105, కొన్ని 100 కన్న తక్కువ ఉంటే, మరి కొన్ని వందకు పైగా ద్విశతి, త్రిశతి, పంచవింశతి వంటివి కూడా ఉన్నాయి. 12వ శతాబ్దం నుండి శతక సాహిత్యం ప్రారంభమైనది. అది కూడా వృషాధిప శతకంతో ఆరంభమైది. నిర్థిష్ట శతక నియమాలు, లక్షణాలైన పద్య సంఖ్య, మకుటం, ఏక రసాత్మకం, ఏక ఛందస్సు వంటివి. అయితే కొంత మంది సాహిత్య చరిత్రకారులు శతక ప్రక్రియ బీజాలు ఆది కవి నన్నయ రచించిన ఆంధ్ర మహా భారత