పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎంతకాలమైంది ......

చిత్రం
ఎంతకాలమైంది ...... భావ శూన్యమైన వేళ  ఆలోచనలు తొలచిన వేళ పలుకుల పొందిక లేక సందడి చేసే ఉత్సాహం లేక కాలం ద్రోలించటం పైనే దృష్టి నిలిపిన వేళ  ఎక్కడి నుండి వస్తుందీ కవితావేశం. భరోసా లేని బ్రతుకులు చస్తూ బ్రతుకుతూ కాలం వెళ్లదీస్తున్న  దేశం. భోగ భాగ్యాలతో తులతూగే నా దేశం నేడు  పరాయి దేశాల ఆపన్న హస్తం వైపు చూపులు. అహంకారం తలకెక్కితే ఏమవుతుందో చూపిన కరోనా స్థితిమంతులమే అయిన భయాందోళనల నడుమ పయనం మా మనుగడ కోసం. రెక్కాడితేగాని డొక్కాడలేని శ్రమజీవుల పాలిట ఏ దేవుడు కరుణించేను. గూడు లేని బ్రతుకును, రోడ్డునే నమ్ముకున్న దీనులను ఉద్ధరించే వారేరి ? కరోనా అంటు వ్యాధి బారిన పడిన ఈ వేళ విధించిన నిర్భంధ వేళ   మధ్య తరగతికి రోజు గడిచేది ఎలాగో ? మహమ్మారి  ఉపశమనానికి నిధుల వర జల్లులు కురిసిన  భూమి పుత్రులకు చేరిందా...? స్వీయా నాయకోదరపోషణార్థం కాక ప్రతి పేదవారికి చేరితే అదే మాధవ సేవా. మధ్య తరగతి కష్ట నష్టాలను  జీవన వేదనలను గమనించినా చాలు అదే పదివేలు. ఆసుపత్రిలో బేడ్ లేక ఆక్సిజన్ లభించక, ప్రతి గ్రామం, పట్టణం, నగరం అనే భేదం లేకుండా మరణ మృదంగం ధ్వనిస్తూంటే... ప్రాణాలు పోయిన వేళ  కళ్ళలో కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప, ఏమి