ఉగాది కవితా చదవండి మీరిక
ఉగాది కవితా చదవండి మీరిక ఉగాదులు మానవ కాల చక్రాన్ని తెల్పిన మనోవేగానికి అవధులెక్కడా ..!? విచిత్రాది నేతలతో బాకాల గోలలతో పట్టి పీడిస్తున్న సమస్యల నుండి కాస్తా దూరంగా హృదయాని రంజింపచేద్దాం. పచ్చని మామిడి చిగురులు తీయని కోకిల స్వరాలు కైపెక్కిన తనువు శృంగార దేవత లేక ఒళ్ళు విరిచిన ఇక్షువిల్లుకాడు(మన్మథుడు). ఎండలకు తాళలేక వరదకట్టిన చెమట ధారలు చిక్కని-చక్కని సౌందర్యాధనకు మరో మారు స్వాగతం పలుకుతూ ఈ ఉగాది పిల్లి మొగ్గలేస్తూ ప్లవగా సమృద్ధిగా సస్యశ్యామలంగా జల కళతో దర్శనమిస్తుంది. విజృంభిస్తున్న కరోన మందులు మాకులు లేక టీకానే శరణ్యమైన వేళ అదీనూ అందరికి అందుబాటులో లేక... ఆహా నాయకుల హేలా... అవునూ మనసును రంజింప చేయాలి కదా బాంధవ్యం ఏమిటో బంధువు ఎవరో స్నేహం ఏవరిదో చుక్కలాగా అంత మంది ఉన్న తనను చేరుకోన్నా వాళ్ళు ఎంత మంది. తీయని ఫలాల కోసం ఆశగా చూసే ఈలోకం కొత్తగా ప్లవ నామ సంవత్సరం ఏమిస్తుంది. ఇస్తుంది మా నవ లోకానికి ఓ ఓదార్పు ఓ విజయపథం సౌందర్య లాలసాన్ని, సామాజిక సమస్యలను సమపాళ్ళలో మిశ్రమించి చూచిన తనువుకు, మనసుకు ఆనందాన్ని, ఆధ్రతను, కలుగజేస్తుంది. మనోనేత్రాలను వికసింపజేస్త