పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

అధ్యాపకత్వం వైపు మరలిన క్షణం...

చిత్రం
అధ్యాపకత్వం వైపు మరలిన క్షణం... దరఖాస్తులు నింపిన నిరాశతో వెనుదిరిగిన రోజులున్నా మౌఖిక పరీక్షలో విఫలమైన ఏ రోజుకైన నేను పాఠం చెప్పకపోనా అనే ఆశావాద దృక్పథం నిత్యం ప్రోత్సహిస్తుంది.                                            అనుభవం లేసమాత్రమైన లేకపోయిన విషయాసక్తి ధైర్యమిస్తుంది. చదివిన చదువుకు సార్థకత్వం సాధించుకోడానికే ఈ తపన నమ్మి ఉపాధి చూపి అభివృద్ధిలోకి వస్తానని విశ్వసించిన కళాశాల యాజమాన్యానికి సదా కృతజ్ఞతులు తెల్పుకుంటూ... తొలిసారిగా అధ్యాపక వృత్తిలో మొదటి గంట కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న... విద్యార్థుల మనసును గెలుచుకోవడానికి వేళ్తున్న... చదివిన విశ్వవిద్యాలయానికి పనిచేసే సంస్థకు వన్నె తీసుకురాడానికి ప్రయత్నిస్తా ఈ విద్యా వ్యవస్థలోకి అడుగు పెడుతున్న... సామరస్యం ఔదార్యం నేర్పు ఓర్పు పాటవంతో ముందుకు సాగుతా.... సహృదయంతో ఆశీర్వచనం ఇచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు, స్నేహితులకు, నా శ్రేయోభిలాషులకు, అందరికి నమస్కరిస్తున్న... పాఠం చేప్పడం ఒక్క కళ ఈ కళను   సాధన చేయడానికే ఈ పయణం.                                                                -పోల బాల