పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

చిత్రం
  77వ స్వాతంత్ర్య దినోత్సం 77వ    స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వేడుక ఓవైపు విశృంఖలమైన స్వేచ్ఛ మరోవైపు స్వాతంత్ర్యం స్వార్థపరుల పైశాచికానందం పేదబీదలకు వైద్యం చేసే మహిళ డాక్టర్ను స్వేచ్ఛ స్వాతంత్రం బలితీసుకుంది. స్వేచ్ఛ సత్యాన్ని కప్పి ఆత్మహత్య అంది. స్వా- తంత్రం    ప్రిన్సిపాల్ ని పెద్ద మేడికల్ కాలేజీకి బదిలీ చేసింది. స్వా తంత్రం ఇప్పుడు నిందితుడు దొరికాడు అరెస్ట్ చేశాము అంది. పోస్ట్ మార్ట్ రిపోర్ట్ వ్యక్తికాదు సామూహిక అత్యాచారమని తీవ్రమైనగాయతో హత్య చేశారని నిజం పలికింది. కలకత్తా ప్రభుత్వమే మహిళపై    మమత చూపి ధర్న చేస్తుంది. హైకోర్టు ఆదేశంతో  సిబిఐ నేరపరిశోధన చేయడానికి సిద్ధమతుంది. పోలీసు బాస్ మీడియాకు తల ఎత్తకుండా సామగానం చేశాడు. ఇంకా నిందిత- బాధితురాల బైయోడేటాన్వేషణలో రాచ కీయ కీచకుల వ్యూహాకర్తల రచనోపాయాలకు సాన పడుతున్నాయి. శిక్షాస్మృతి కఠిణ శిక్షలకోసం పేజీలు తిప్పుతుంది. స్వేచ్ఛగా తిరుగుతున్న నేరాని ప్రతిఘటించలేని ప్రజలు   తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు. స్వేచ్ఛ స్వాతంత్రం కదా అంతే మరీ స్వా తంత్రం లో స్వేచ్ఛ.

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ

  వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ డాక్టర్. పోలా బాలగణేశ్ టి.జి.టి. తెలుగు   ఉపాధ్యాయులు, గేస్ట్ ఫ్యాకల్టి, ఏకలవ్య ఆదర్శ ఆవాశ పాఠశాల, బుట్టాయిగూడెం, ఏలూరు జిల్లా-532502 ఉపోద్ఘాతం                       భారతీయ ఇతిహాసంలో రైతుల ప్రస్థానం గమనించినట్లైతే మొదట చాతువర్ణ వ్యవస్థలో వైశ్యులు వ్యవసాయం చేయడం గమనిస్తాము. తర్వాత కాలప్రవాహంలో ఈ వ్యవసాయం శూద్రులకు సంక్రమించింది. నేడు వ్యవసాయం చేయని, రాని వర్గం లేదు. నాగరికతకు పునాది వేసింది వ్యవసాయం అంటే అతిశయోక్తి కాదు. అటువంటి రైతు పరిస్థితి నేటికి అస్థవ్యస్థంగా ఉంది. రైతుల పట్ల నిరాధరణ పరిస్థితులు పెరుగిపోతున్నాయి. అందులో ఓటుబ్యాంకు రాజకీయాలు కారణంగా పార్టీ రైతులు తప్ప పూర్తి రైతాంగం ప్రభుత్వ సదుపాయాలు పొందడం లేదు. “ వ్యవసాయం సాటిలేని సృజనాత్మక కళ. ప్రపంచంలో సజీవ సృష్టి చేసే కళ అదొక్కటే చరిత్రలో మొట మొదటి మౌళిక కళాకారుడు రైతే. చరిత్రలో సాటిలేని వంచన పాలయ్యింది కూడా రైతే ” అని పాపినేని శివశంకర్ గారు ‘ రైతు కవితా వికాసం ’ అనే వ్యాసంలో పేర్కోన్నారు. ఈ మాటలు అక్షరసత్యాలు. నేటికీ రైతు వంచనకు గురౌతున్నాడు.                     మన దేశంలో

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

చిత్రం
  గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం డాక్టర్. పోల బాల గణేష్ ,   ఈ.ఎం.ఆర్. మోడల్ స్కూల్ ,   బుట్టాయిగూడెం ,   ఏలూరు జిల్లా   ఆంధ్ర ప్రదేశ్ -5344465 9704555450.              భూమిపై మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు సాటి మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలి. తనలాగా తోటి మనిషి కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నాడని అతని పట్లకనీసంగా మానవత్వం కలిగి వ్యవహరించాలనే దృక్పథం గురజాడ కవిత్వంలో కనిపిస్తుంది.   భారతీయ సమాజం వర్ణాలుగా విభజింపబడి , ఆయా వర్ణాలు తమదైన వృత్తిని జీవన విధానాలు కలిగి సమాజంలో జీవిస్తుంటారు.   కానీ మన భారతీయులు వర్ణాశ్రమ ధర్మాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి కనీసం మానవులుగా కూడా వ్యవహరించకుండా, ఈ సమాజంలో అట్టడుగు వర్గాన్ని సృష్టించి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించే అనేక నియమాలను   ఏర్పరచుకొని జీవించడం జరిగింది.   “ మలిన వృత్తులు మాలవారని కులము వేర్చిన బలియు రొక దే శమున కొందరి వెలికి దోసిరి మలినమే, మాల కులము లేదట వొక్క వేటున పసరముల హింసించు వారికి కులము కలదట నరుల వ్రేచెడి క్రూర కర్ములకున్. మలిన దేహుల మాల లనుచును, మలిన చిత్తుల కధిక కులముల నెల వొసంగిన వ
చిత్రం
  శుభకృత్  శుభకృత్ శోభను చేకురుస్తూ ముందుకు వచ్చింది మామిడి చిగురు తొడిగినట్టు  నూతన ఆశలను ఆశయాలను  కాలం సంచిలో వేసుకొని వచ్చింది శుభకృత్ ఉగాదిలో నూతన జీవితాానికి  షడ్రుచుల ఆస్వాధనను తెనుంనది. పైశాచిక మతవాదులు నలుదిక్కుల వ్యాపిస్తున్న... మధ్యతరగతి ఆర్థిక నడుము విరుగుతున్న నిరుద్యోగులు ఉద్యోగమో రామచంద్రా  అంటున్నా వేళ శుభకృత్ శుభాని చేకురుస్తూ.... ఆకలికి అలమటించి గూడులేక దారి తెన్నులేక నలిగిపోతున్న వేళ ఈ శుభకృత్ వత్సరం పేదలకు చేయందిస్తూ.... సకల కల్మషాలతో  కుటీలాలోచనలతో పైకి అమృతతపు చిరునవ్వును చిందింస్తూ.... అంతరంగంలో హాలాహలం పెంపోదింస్తూ.... పైకి దివెనలు కురుపిస్తూ లోన అధః పాతాళానికాంక్షిస్తూ.... మనుషుల మధ్య నున్న వేళ విశ్వాసానికి కపటానికి తేడా ఎరుగని  సంకుచిత చిత్తుల నడుమ .... శుభకృత్ శుభాని.... యూద్ధం శాంతి అంటూ ప్రపంచం చిందరవందరగా ఉన్న ఈ వేళ శుభకృత్ వస్తుంది.  మేధావులంతా కమలనాథులకు తాళాలు మోగిస్తూ... ఆశ్రీతులకు అద్దలం ఎక్కించడానికి విశ్వయత్నాలు చేస్తూ...వేళ రాజ్యాంగం విస్మరించి సౌభ్రాతృత్వం అంటుంచి  సామ్యవాదం మరిచి ప్రైవేట్  పథం పట్టిన వేళ  శుభకృత్ శుభాని తెస్తుంది. మాయమాటలతో ఆరవై స